క్రైమ్/లీగల్

కాలం చెల్లిన విత్తనాల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 6: జడ్చర్ల పట్టణంలో సుమారు రూ.7.60లక్షల విలువైన కాలం చెల్లిన విత్తనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ అనురాధ తెలిపారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జడ్చర్ల పట్టణంలో వెంకటకృష్ణయ్య, కొండయ్య అనే వ్యాపారస్థులు తమ ఇళ్లలో విక్రయానికై భద్రపరిచిన నకిలీ విత్తనాలు ఉన్నాయనే పక్కా సమాచారం అందడంతో వారి ఇళ్లపై పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు జరిపి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విత్తనాల కాలపరిమితి 2016-17వరకు ఉన్నా వ్యాపారులు ఈ ఏడాది రైతులకు విక్రయించేందుకు భద్రపర్చినట్లుగా తెలిసిందన్నారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు ముందుగానే కాలం చెల్లిన విత్తనాలను స్వాధీనం చేసుకోవడం వల్ల చాలా మంది రైతులను కాపాడిన వారిమి అవుతామని పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ కాలం చెల్లిన విత్తనాలు వ్యాపారులు విక్రయిస్తే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుత రబీ సీజన్‌కు రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు సిడ్స్ కంపెనీలకు వెళ్తున్నారని వారికి ఇలాంటి వ్యాపారులు విత్తనాలు అందించడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇకముందు జిల్లాలో ముమ్మరంగా దాడులు నిర్వహించి ఎక్కడైన అలాంటి విత్తనాలు లభ్యమైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
హంతకుడి అరెస్టు
అలాగే జడ్చర్ల రైల్వే క్వాటర్స్‌లో జరిగిన తేజానాయక్ హత్య ఉదంతానికి సంబంధించిన హంతకుడు లింగంను జడ్చర్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అనురాధ వెల్లడించారు. జడ్చర్ల పట్టణంలో రైల్వేక్వాటర్స్ గృహనిర్మాణాన్ని చేస్తున్న కాంట్రాక్టర్ వద్ద హంతకుడు లింగం వాచ్‌మెన్‌గా పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే తనకు బదులు తన స్నేహితుడు తేజానాయక్‌తో పనిచేయించాడు. కొన్ని రోజుల తర్వాత మనస్సు మార్చుకున్న హంతకుడు పని నుండి తప్పుకోవాలని తానే వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తానని పేర్కొనగా అందుకు తేజానాయక్ ఒప్పుకోకపోవడంతో తలపై కర్రతో బాది హత్య చేసినట్లు పోలీసుల విచారణలో లింగం ఒప్పుకున్నాడు. ఈ మేరకు అతడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్న ఎస్పీ అనురాధ తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో డిఎస్పీ భాస్కర్, జడ్చర్ల సీఐ బాలరాజ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.