క్రైమ్/లీగల్

విగ్రహాలు అపహరించే ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, ఏప్రిల్ 6: కర్నాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో బెంచి కొట్టాల గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఏడాది క్రితం నాలుగు కుంచు దేవత విగ్రహాలను చోరీ చేసిన ఏడుగురు దొంగలను అనంతపురం సీసీఎస్, వన్‌టౌన్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు డిఎస్పీ వెంకట్రావు తెలిపారు. వీరి వద్ద నుంచీ రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ వెంకట్రావుతో పాటు సీసీఎస్ డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ విజయ్‌భాస్కర్‌గౌడ్ పాల్గొన్నారు. డిఎస్పీ వెంకట్రావు మాట్లాడుతూ విగ్రహాల చోరీకి పాల్పడిన ముఠా సభ్యులు ఏడుగురు అనంతపురం జిల్లాకు చెందిన వారేనన్నారు. వీరంతా యువకులు కావడంతో పాటు జల్సాలకు అలవాటు పడటం, ఆర్థిక ఇబ్బందుల పాలు కావడంతో సులభంగా డబ్బు సంపాధించాలి అనే లక్ష్యంతో దేవాలయాలను టార్గెట్‌గా చేసుకుని కంచు విగ్రహాలతో పాటు పంచలోహ విగ్రహాలను చోరీ చేయాలని పథకం రచించారన్నారు. ఇందులో భాగంగా బళ్ళారి జిల్లాలోని బెంచికొట్టాల గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో విగ్రహాలను చోరీ చేయాలని పథకం పన్ని చోరీ విజయవంతంగా పూర్తి చేశారన్నారు. దేవాలయంలో ఉన్న రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలను ఎత్తుకెళ్లిన ఏడుగురు నిందితులు అమ్మటం పెద్ద సమస్యగా తయారయ్యిందన్నారు. ఇళ్లల్లో ఉంచుకోవటం సైతం పెద్ద సమస్యగా మారటంతో ఎలాగైన విగ్రహాలను అమ్ముకుని సోమ్ము చేసుకొవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూవచ్చారన్నారు. చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదన్నారు. పట్టు వదలని వీరు అనంతపురంలో అమ్మాలని వీరు వచ్చారన్నారు. స్థానిక బసవన్న కట్ట దగ్గర మకాం వేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, పక్కా సమాచారం సీసీఎస్ డిఎస్పీకి అందిందన్నారు. నిందితులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించామన్నారు. తాము చోరీ చేసిన విగ్రహాలు తెలపడంతో అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. బజంత్రీ రవి అలియాస్ స్వామి కనేకల్లు, హరిజన నాగరాజు అలియాస్ నవీన్ కనేకల్లు, షేక్ మహమ్మద్ గౌస్ కనేకల్లు, మద్ది మానురాజు అలియాస్ రాజు నార్పల, పోపుల రామాంజినేయులు అనంతపురం, వికలాంగుల కొట్టాల బెస్త యువరాజు కనేకల్లు, సాకే ముసలయ్య అలియాస్ చిన్న రాప్తాడుకు చెందిన వారని తెలిపారు.

మహిళ అనుమానాస్పద మృతి
గోరంట్ల, ఏప్రిల్ 6 : మండల పరిధిలోని గుంటిపల్లితండాలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తండాకు చెందిన భార్యభర్తలు రాంజీనాయక్, సాలేబాయిలు ఘర్షణ పడ్డారు. సాలేబాయిని భర్త కర్రతో కొడుతుండగా కుమార్తె చిట్టిబాయి (28) అడ్డుపడింది. దీంతో కర్ర దెబ్బ తగిలి తీవ్ర గాయాలకు గురై ప్రాణం విడిచింది. సమాచారం అందగానే సంఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.