బిజినెస్

నీరవ్ మోదీపై నాన్‌బెయిలబుల్ వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ముంబయి ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం, నీరవ్ మోదీ ఆయన బంధువు మెహుల్ ఛోక్సీలపై నాన్ బెయిలబుల్ వారంట్లను జారీచేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న 2 బిలియన్ల యుఎస్‌డి అక్రమాలపై వీరికి ఈ వారంట్లు జారీ అయినట్ల అధికార్లు ఆదివారం వెల్లడించారు. దేశంలో జరిగిన అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంగా పరిగణిస్తున్న ఈ కుంభకోణానికి సంబంధించి విచారణకు హాజరు కావడానికి పదేపదే తిరస్కరిస్తున్న నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీలపై నాన్ బెయిలబుల్ వారంటును జారీ చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం స్వీకించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. విచారణకు హాజరు కావాల్సిందిగా మోదీ, చోక్సీల అధికారిక ఈ-మెయి ల్ ఐడీల ద్వారా సీబీఐ కోరినప్పటికీ, ఆరోగ్యకారణాలను చూపుతూ వారు పదే పదే తిరస్కరిస్తూ వస్తున్నారు. కాగా ప్రస్తుతం న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారంట్ దాఖలు చేసిన నేపథ్యంలో, వీరిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీచేసి ఇంటర్‌పోల్ సహకారాన్ని సీబీఐ కోరే అవకాశం లభించింది. నీరవ్ మోదీ హాంగ్‌కాంగ్‌లో ఉన్నట్టు సమాచారం అందుకున్న ప్రభుత్వం, ఆయన్ను అరెస్ట్ చేయలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు జారీ అయినట్టుగా చూపించిన తప్పుడు ‘లెటర్ ఆఫ్ అండర్ టేకిం గ్స్’ ఆధారంగా రుణ సదుపాయాలను కల్పించిన విదేశీ బ్యాంకు అధికార్లను సీబీఐ ప్రశ్నిస్తోంది. హాంగ్‌కాంగ్‌లో అలహాబాద్ శాఖకు సంబంధించి, ఫారెన్ ఎక్చేంజ్ లావాదేవీలను నిర్వహించిన అధికారిని విచారణ నిమిత్తం హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీచేసింది. ఆయన త్వరలోనే విచారణకు హాజరు కానున్నా రు. ఇదిలావుండగా పంజాబ్ నేషనల్ బ్యాంకు కు చెందిన బ్రాడీ రోడ్ శాఖ నుంచి మోదీ, చోక్సీల పేరు న స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్సియల్ టెలికమ్యూనికేషన్) సందేశాల రూపంలో ఎల్‌ఓయులు, ఎల్‌సీలు జారీ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి అనేక మంది బ్యాంకు ఉద్యోగులను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది. ఎల్‌ఓయూ అంటే దరఖాస్తు దారుడికి స్వల్పకాలిక రుణం అందించేందుకు వీలుగా ఇష్యూ బ్యాంకు అందించే హమీ పత్రం. ఒకవేళ దరఖాస్తు దారుడు ఆ రుణాలను చెల్లించడంలో విఫలమైతే, హామీగా ఉన్న బ్యాంకు ఆ మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది.
విచిత్రమేమంటే ఈ స్విఫ్ట్ సందేశాలు బ్యాంకు సాఫ్ట్‌వేర్‌లో నమోదు కాలేదు. కాగా పంజాబ్ నేషనల్ బ్యాం కును మోసం చేసిన కేసుల్లో నీరవ్ మోదీ, ఆయన భార్య, సోదరుడు, చోక్సిలపై కేసు నమోదైంది.