క్రైమ్/లీగల్

కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 12: జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ క్యా ంపు కార్యాలయానికి కూతవేటు దూ రంలో భారీ చోరీ జరగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎల్లవేళలా పో లీసు పహారాతో పటిష్టమైన భద్రత కలిగిఉండే ప్రాంతంలోని ఓ వస్త్ర షో రూమ్‌లో ఆగంతకుడు ఎంతో చాకచక్యంగా చొరబడి సుమారు మూడు ల క్షల రూపాయల వరకు సొత్తును దో చుకుని ఉడాయించాడు. ఈ సంఘటనను గోప్యంగా ఉంచేందుకు పోలీసు అధికారులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, షోరూమ్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో గురువారం ఉ దయం బయటకు పొక్కింది. దుకాణ ంలో ఏర్పాటుచేసిన క్లోజ్‌డ్ సర్క్యూట్ కెమెరాలలో నిందితుడి ఆనవాళ్లు ని క్షిప్తం కావడంతో, ఆ ఫుటేజీల ఆధార ంగా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కమిషనరేట్ కార్యాలయానికి అతి చేరువలోగల మూడంతస్తుల భవన ంలో కిడ్స్ కనెక్టివ్ వస్త్ర షోరూమ్ ఉ ంది. మంగళవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో దుండగుడు ఈ షోరూమ్‌కు ఆనుకునిఉన్న పక్క బిల్డింగ్ పై నుండి మూడవ అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ లిఫ్టును పక్కకు తొలగి ంచి, మనిషి కిందకు దూరేంత స్థలం చేసుకున్నాడు. అనంతరం తాడు స హాయంతో ఎంతో లాఘవంగా రెం డవ అంతస్తులోకి దిగి, అక్కడినుండి మొదటి అంతస్తులోకి చేరుకున్నాడు. క్యాష్ కౌంటర్‌ను తెరిచి అందులో ఉన్న నగదుతోపాటు విలువైన కొన్ని వస్త్రాలను తీసుకువచ్చిన దారినే ఉడాయించాడు. దాదాపు గంటన్నరపాటు దుండగుడు ఎంతో తాపీగా షోరూమ్ లో చోరీచేసి తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అక్కడినుండి ని ష్క్రమించినట్టు సీ.సీ కెమెరా ఫుటేజీలనుబట్టి తెలుస్తోంది. రోజువారీలాగే బుధవారం షోరూమ్ యజమాని షా పు తెరిచి చూడగా, చోరీ జరిగిన విషయాన్ని గమనించి కౌంటర్‌లోని నగదును, వస్త్ర నిల్వలను సరి చూసుకుని నగదుతోపాటు మొత్తం 3లక్షల రూ పాయల వరకు సొత్తు అపహరణకు గురైనట్టు గుర్తించారు.