తెలంగాణ

ఇంటర్‌లో తప్పినందుకు పలు చోట్ల విద్యార్థుల ఆత్మహత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పినందుకు మనస్తాపంతో పలు చోట్ల విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో శ్రీవిద్య (18) చింతల్‌లోని గాయత్రి కళాశాలలో ఇంటర్ ఎంపిసి తొలి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడకు చెందిన వర్ష (16) ఇంటర్ తొలి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరో సంఘటనలో కూకట్‌పల్లి సమీపంలోని కైతల్లాపూర్‌కు చెందిన కాట్రాజ్ కిరణ్ (16) ఇంటర్ ప్రథమ సంవత్సరం తప్పడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఫెయల్ అవుతాననే బెంగతో..
విద్యార్థిని ఆత్మహత్య
ఆత్మకూరు: వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య శుక్రవారం చేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం వంగెటి జాహ్నవి (17) నగరంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది. శుక్రవారం ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడికి ముందే ఫెయల్ అవుతానేమోననే భయంతో జాహ్నవి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫలితాల వెల్లడి తరువాత ఒక సబ్జెక్టులో ఆమె ఫెయల్ అయనట్లు తేలింది. కాగా, ఉరేసుకొన్న ఆమెను స్థానికులు గమనించే లోగానే మృతిచెందింది. మృతురాలి తండ్రి చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.