తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ రూరల్‌జిల్లా, ఏప్రిల్ 20: రైతులు పండించిన పంటను మద్య దళారులకు అమ్ముకుని మోస పోవద్దనే ఉద్ధేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెరుకవేడు, మండల కేంద్రంలోని వ్వయసాయ మార్కెట్ అవరణలో ఐకేపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాలను ఏమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యమైన ధర ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. మండలంలోని మార్కెట్ అవరణలో 26లక్షల వ్యయంతో నూతనంగా వ్యవసాయ గిడ్డంగిని నిర్మించనున్నట్లు తెలిపారు.