రాష్ట్రీయం

ఎట్టకేలకు టీటీడీ పాలక మండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరదించుతూ తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ) పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఇటీవలే టీటీడీ చైర్మన్‌గా సుధాకర్ యాదవ్‌ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాలకమండలిని ప్రకటించింది. పాలక మండలి సభ్యులుగా ఎంపీ రాయపాటి సాంబశివరావు(గుంటూరుజిల్లా), ఎమ్మెల్యేలు గౌతు శ్యాం సుందర శివాజీ (శ్రీకాకుళం జిల్లా), బొండా ఉమా మహేశ్వరరావు(కృష్ణా), వంగలపూడి అనిత(విశాఖ), బి.కె.పార్థసారధి(అనంతపురం), టీడీపీ నేతలు చల్లా రామచంద్రారెడ్డి(చిత్తూరు), పొట్లూరి రమేష్ బాబు(కృష్ణా), ఇ.పెద్దిరెడ్డి (తెలంగాణ), సండ్ర వెంకట వీరయ్య (తెలంగాణ), సుధా నారాయణ మూర్తి (కర్నాటక), సపన్న మునగంటివార్ (మహారాష్ట్ర), రుద్రరాజు పద్మరాజు(తూర్పుగోదావరి), మేడా రామకృష్ణారెడ్డి(కడప), డొక్కా జగన్నాథం (తూర్పుగోదావరి) నియమితులయ్యారు. రెండు సంవత్సరాల పాటు పాలక మండలి సభ్యులుగా వీరు కొనసాగుతారు. వివిధ రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ పాలకమండలిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూర్పు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.గత కొన్ని
సంవత్సరాలుగా టీటీడీ చైర్మన్ పదవి కోసం తపనపడ్డ రాయపాటి సాంబశివరావుకు చైర్మన్ పదవి దక్కకపోయినా, బోర్డు సభ్యుడి పదవి వరించింది. టీటీడీ ఈఓ సెక్రటరీ మెంబర్‌గా, ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఉంటారు. మొత్తం మీద 18 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటైంది. వేసవి నేపథ్యంలో ఏర్పాటైన ధర్మకర్తల మండలి ముందు పెనుసవాళ్లు ఉన్నాయి. వీటిని ఎలా అధిగమిస్తారన్నది వేచిచూడాల్సిందే.
ఇదిలావుండగా తిరుపతి నుంచి ఎన్‌టిఆర్‌కు, సిఎం చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా ఉన్న రామచంద్రరాజు (ఎన్టీఆర్ రాజు) కుమారుడు శ్రీ్ధర్‌వర్మకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం వస్తుందని భావించినప్పటికీ చివరి నిమిషంలో ఆయనకు అవకాశం దక్కలేదు.