ఆంధ్రప్రదేశ్‌

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 21: ఎమ్మెల్సీ ముద్దు కృష్ణమనాయుడు మృతితో చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ జారీ చేసింది. జిల్లాలో ఈ స్థానానికి 2015 జూన్ లో ఎన్నికలు జరిగాయి, అప్పట్లో తెలుగు దేశం పార్టీకి చెందిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో గాలి ముద్దు కృష్ణమ నాయడు మరణించడంతో ఈ స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించడానికి శనివారం తాజాగా షెడ్యూల్‌ను జారీ చేసింది. దీంతో ఈ నెల 26న ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. వచ్చే నెల 3వ తేది వరకు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసుకోవచ్చు. 4న వాటి పరిశీలన, 7న నామినేషన్ల ఉపసంహరణతో పాటు అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఎన్నికల పోలింగ్ మే నెల 21వ తేదిన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు 24న చేపట్టనున్నారు.