ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా తెలుగువారి హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: ప్రత్యేక హోదా తెలుగు వారి హక్కు.. దీన్ని ఎవరూ నిలువరించలేరని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నెల రోజులపాటు ప్రత్యేక హోదాపై సైకిల్ యాత్ర నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్గించే విధంగా కృషి చేయాలనే ముఖ్యమంత్రి పిలుపు మేరకు మంత్రి ఉమా నేడు శ్రీకారం చుట్టారు. శనివారం స్థానిక గొల్లపూడి సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి ప్రత్యేక హోదాపై ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు యువకులు, ప్రజాప్రతినిధులతో కలిసి సైకిల్ ర్యాలీ కార్యక్రమాన్ని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన విధంగా విభజన హామీలైన 19 అంశాలను అమలు చేయవలసిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో ఎందుకు ఇవ్వరో కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.