గుంటూరు

మాతా శిశు మరణాలు తగ్గించాలి: పూనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఏప్రిల్ 22: మాతా శిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య అన్నారు. చినకాకానిలో గల ఎన్నారై ఆస్పత్రిలో గైనకాలజీ విభాగం ఆధ్వర్యాన నిర్వహించిన వర్క్‌షాపును మాలకొండయ్య ప్రారంభించి ప్రసంగించారు. ఎన్నారై అకాడమీ ఆఫ్ సైనె్సస్ అధ్యక్షులు నిమ్మగడ్డ ఉపేంద్రనాధ్ అధ్యక్షత వహించారు. పూనం మాలకొండయ్య తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గర్భిణులకు ప్రసవ సమయంలో అవసరం లేకపోయినా సిజేరియన్ చేయరాదన్నారు. కొందరు ముహూర్తాలు పెట్టుకుని సిజేరియన్ చేయించుకునే పద్ధతి కూడా సరికాదని పూనం అన్నారు. వైద్యసేవలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని, గర్భిణులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలద్వారా పాలు, గుడ్లు, పోషకాలు అందిస్తోందన్నారు. వైద్యులకు తరచుగా తర్ఫీదు ఇవ్వడం అభినందనీయమని, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి మొదలైన చోట్ల కూడా వైద్యులకు తర్ఫీదు ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డాక్టర్ అక్కినేని మణి మాట్లాడుతూ గర్భిణులకు ప్రసవ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి వైద్యులకు ఇటువంటి శిక్షణ ఉపయోగ పడుతుందన్నారు. డైరెక్టర్ డాక్టర్ ఎన్ నరసరాజు, డాక్టర్ ఉన్నీ సిల్కోసెట్ , డాక్టర్ రష్మి, హెచ్‌ఓడీ డాక్టర్ ప్రభావతి, ఆస్పత్రి సూపరింటెంట్ సి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.