రాష్ట్రీయం

ఇక పంచాయతీ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలంతా ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలకు మంగళవారం ‘శ్రీకారం’ చుట్టినట్టయింది. పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా నోటిఫికేషన్‌ను తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ పకారం 2018 ఏప్రిల్ 30 న డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రకటిస్తారు. వార్డుల వారీగా సిద్ధం చేసే ఓటర్ల జాబితాలను గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఓటర్ల జాబితాలపై చర్చించేందుకు మే 1న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో జిల్లా ఎన్నికల అధికారుల వద్ద నిర్వహిస్తారు. మే 3న మండలస్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓటర్ల జాబితాలపై ప్రజలు తమకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే మే 1 నుండి మే 8 వరకు లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. మే 10 న ఈ ఫిర్యాదులపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రజల్లో చెతన్యం తీసుకురావాలన్న లక్ష్యంతోనే అఖిలపక్షం సమావేశాలను నిర్వహిస్తున్నారు. 2018 మే 17 న ఓటర్ల తుది జాబితాలను ప్రకటిస్తారు. నిబంధన మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన ఓటర్ల జాబితాలను పంచాయతీ ఎన్నికలకు కూడా వినియోగిస్తారు. ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్‌కుమార్ ప్రకటించారు.