రాష్ట్రీయం

గవర్నర్‌ను చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గవర్నర్‌నుకలిసి చర్చించి విషయాలను బహిర్గతం చేయాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. టిడిపి, బిజెపి లోపాయికారిగా ఒప్పందాలతో ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావవేశంలో ఆయన మాట్లాడుతూ, నాలుగేళ్లుగా చేస్తున్న అవినీతి, ఓటుకు కోట్ల కేసును తప్పించుకోవడానికి చంద్రబాబు మళ్లీ బిజెపితో ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ కోసం కేంద్రాన్ని ఏనాడు చంద్రబాబు నిలదీయలేదన్నారు. రాష్ట్రం కోసం ఏనాడూ ఆలోచించని చంద్రబాబు ఇప్పుడు మరో డ్రామాకు తెరలేపారన్నారు. కేంద్రంతో దూకుడు వద్దని గవర్నర్ సూచించినట్లు టిడిపి చెబుతోందన్నారు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు చేసిన మోసానికి నిరసనగా ఈ నెల 30వ తేదీన వంచన దినంగా తమ పార్టీ ప్రకటించిందన్నారు. విశాఖలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు వ్య తిరేకంగా నిరసన తెలియచేస్తామన్నారు. వైకాపా ఆదేశాల మేరకు ఈనెల 30న ఆందోళన చేపడుతామన్నారు. రాష్ట్ర ప్ర జానీకానికి బాబు చేసిన మోసాలను వివరించి మళ్లీ మోసపోకుండా చైతన్యవంతులను చేస్తామన్నారు. ఈ వంచనకు టిడిపి, బిజెపి రెండూ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు.