తెలంగాణ

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న గద్దర్ కుమారుడు సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ప్రజా గాయకుడు గద్దర్ కుమారుడు జివి సూర్య కిరణ్ (సూర్య) కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. బుధవారం ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌ను పార్టీ పెట్టాల్సిందిగా గద్దర్ వత్తిడి తెచ్చారు. కానీ గద్దర్ కుమారుడు మాత్రం ప్రొఫెసర్ కోదండరామ్ సారథ్యంలో ఏర్పాటైన తెలంగాణ జన సమతి (టిజెఎస్)లో చేరకుండా కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు. అయితే టిజెఎస్, సిపిఐ ఎన్నికల ముందు కాంగ్రెస్‌తో కలిసే పోటీ చేయనున్నాయన్న ప్రచారం జరుగుతున్నది.