తెలంగాణ

మా సభలు బీజేపీ నేతల వెన్నులో వణుకు పుట్టించాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: సీపీఎం 22వ జాతీయ మహాసభలు బీజేపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టించాయని సీపీఎం పార్టీ పొలిట్‌బ్యూరో స భ్యుడు రాఘవులు పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆయన మాట్లాడారు. ఈనెల 18 నుంచి 22 వరకు నిర్వహించిన సభలు విజయవంతం అయ్యాయని వివరించారు. అన్ని వర్గాల వారు ఆర్థిక, హార్థిక సహకారాన్ని అందించడం వల్లే సభలను విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. చివరి ప్రభుత్వం కూడా తమ సభలకు తోడ్పాటును అందించిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కన్నుసన్నల్లో దేశాన్ని పాలిస్తున్న బీజేపీ గద్దె దించడమే అజెండాగా మహాసభలు కొనసాగాయని చెప్పారు. ఐదు రోజుల పాటు సాగిన సభల్లో బీజేపీని కట్టడి చేసే అంశంలో బేదాభిప్రాయాలు వచ్చినా చివరికి ఐక్యతను చాటగలిగామని స్పష్టం చేశారు. చివరి రోజు బహిరంగ సభ తాము అనుకున్నదాని కంటే అద్బుతంగా జరిగిందని అన్నారు. బీజేపీ నాయకుల కలవరపాటే మా సభలు ఏ స్థాయిలో విజయం సాధించా యో స్పష్టం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఇందు కోసం ఈనెల 26 నుంచి 29వరకు సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే సుప్రీం కోర్టు న్యాయమూర్తి అభిసంశన తీర్మానాన్ని ఉప రాష్టప్రత్రి తిరస్కరించడాన్ని ఖండిస్తున్నట్టు రాఘవులు తెలిపారు. పార్లమెంట్‌లో చర్చ అనంత రం జరగాల్సిన పనిని ముందే ఎందుకు తిరస్కరిస్తారని ప్రశ్నించారు.