తెలంగాణ

అయోమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) పై భారీ ఆశలు పెట్టుకున్న పేద బ్రాహ్మణులు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పేద బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ఈ పరిషత్ ప్రకటించింది. మొత్తం 18 పథకాలు ప్రకటించగా, వీటి లో వేదపాఠశాలలు, విద్యకు సంబంధించిన పథకాలు మినహా మిగతా పథకాలు, కార్యక్రమాల పనులు నిధు లు లేకపోవడంతో స్తంభించిపోయాయి. 2016-17 సం వత్సరంలో రూ.100 కోట్లు, 2017-18 సంవత్సరంలో మరో రూ.100 కోట్లను తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ద్వారా కేటాయించింది. 2018-19 సంవత్సరంలో మరో 100 కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తన బడ్జెట్‌లో కేటాయించారు. ఈ పరిషత్‌కు కేటాయించిన నిధులు మురిగిపోకుండా చట్టపరమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు రూ.300 కోట్లు కేటాయించగా కేవలం రూ.3 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని తెలిసింది. ఈ నిధుల్లో రూ.2 కో ట్లు బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర కార్యాలయం ‘బ్రాహ్మణ భవన్’కు కేటాయించారు. మిగతా నిధులు విద్యాపరమైన పనులకు వినియోగించారు. స్వయం ఉపాధి పనులకోసం ‘బెస్ట్’ పేరుతో ఒక పథకాన్ని రూపొందించగా, వందలాది మంది పేద బ్రాహ్మణులు దరఖాస్తు చేసుకున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు, క్యాటరింగ్ తదితర పనులు చేపట్టేందుకు, సేవారంగం తదితర విభాగాల కోసం దరఖాస్తులు వేల సంఖ్యలో వచ్చాయి. ఈ పనులన్నీ అమలు చేసేందుకు కనీసం 20-30 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. అలాగే వృద్ధులకు పింఛన్లు, ఉపనయనం, వివాహాలు, పుస్తకాల ప్రచురణ, ఆరోగ్యం, విద్య, బ్రాహ్మణ భవనాల నిర్మాణం తదితర పనులకోసం వివిధ పథకాలు, కార్యక్రమాలను ప్రకటించారు. వీటి కోసం కూడా దరఖాస్తులు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. పరిషత్ ఏర్పాటై దాదాపు ఏడాదిన్నర గడచినా, నిధులు లేకపోవడంతో పరిషత్ కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. గత ఏడాదిన్నర కాలంగా పరిషత్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాల వివరాలతో ఒక నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారని తెలిసింది. ఈ ఫైలు ప్రస్తుతం కేసీఆర్ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిసింది.
బ్రాహ్మణుల సంక్షేమం పట్ల తనకు అభిమానం ఉందని కేసీఆర్ అనేక పర్యాయాలు ప్రకటించుకున్నారు. అందుకే ఆలయాల అభివృద్ది, అర్చకుల వేతనాలు, ధూపదీప నైవేద్యం పథకం (డీడీఎస్) కోసం భారీగా నిధులు కేటాయించారు. అలాగే యాదాద్రి, భద్రాద్రి, ఏములాడ (వేములవాడ), బాసర, ధర్మపురి తదితర ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులను కేసీఆర్ కేటాయించారు. ఈ పరిస్థితిలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగించేదుకు నిధులను కేసీఆర్ ఇస్తారని రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ఎదురుచూస్తున్నారు.