తెలంగాణ

బ్యాంకులకు ‘రైతుబంధు’ తుది జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘రైతుబంధు’ పథకంలో భాగంగా గ్రామాల పేర్లు, రైతుల పేర్లతో కూడిన తుది జాబితాను వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి మంగళవా రం నాడు బ్యాంకర్లకు అందచేశారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించిన గ్రామాలు, రైతుల పేర్లతో ఉన్న జాబితాను బ్యాంకర్లకు ఈ సందర్భంగా అందించారు. దీంతో రైతుబంధు పథకం కింద ఇప్పటి వ రకు 10,490 గ్రామాల పేర్లతో పాటు 54.15 లక్షల మంది రైతుల పేర్లతో వివరాలను అం దించినట్టయింది. అక్కడక్కడా కొన్ని గ్రా మాలు, ఈ గ్రామాలకు చెందిన రైతుల వివరాలను ఇవ్వాల్సి ఉంది. వ్యవసాయ శాఖ సిబ్బందినుండి సమాచారం అందగానే మిగిలిపోయిన రైతుల పేర్లతో కూడిన జాబితాను బ్యాంకర్లకు అందించేందుకు ఏర్పా ట్లు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు గత 10 రోజుల నుంచి ముద్రణ పూర్తయిన చెక్కులను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు పరిశీలన పూర్తయిన 30లక్షల చెక్కులను జిల్లాలకు పంపించి పూర్తి రక్షణతో భద్రపరిచారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఎన్‌ఐసీ (నేషనల్ ఇన్‌పర్మేటిక్స్ సెంటర్) ఎస్‌ఐఓ (స్టేట్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్) రాంమోహన్, ఎస్‌బీఐ, డీజీ ఎం, ఏజీఎం, సిండికేట్, ఆంధ్రాబ్యాంక్, ఐఓబీ, కార్పోరేషన్, కెనరాబ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఏపీ జీవిబి అధికారులు, ఎన్‌ఐసి అధికారులు పాల్గొన్నారు.