క్రైమ్/లీగల్

ఐదు మంది ఎర్రస్మగ్లర్లపై పీడీ యాక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 25: జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కొరఢా ఝళిపిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టుచేయడం, వారిపై పీడీ యాక్టును ప్రయోగించడం ద్వారా ఎర్రచందనం స్మగ్లర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఎర్రచందనం చెట్లను నరికేందుకు తమిళనాడు నుండి తరలివస్తున్న కూలీల అనుమానాస్పద మరణాల వెనుక కూడా పోలీసుశాఖ ఎత్తుగడలే ఉన్నాయనే ప్రచారం ఉంది. ఈ సంఘటనలన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఎస్పీ అట్టాడ బాబూజీ ఎంత కఠినంగా ఉన్నారనే విషయాన్ని ధృవపరుస్తున్నాయి. తాజాగా ఐదుమంది ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించారు. అంతర్జాతీయ స్మగ్లర్లుగా పేరుపొందిన షేక్ ముస్త్ఫా, వేది అలియాస్ వేది శక్తివేలు, విశ్వనాధన్, కామేష్, ఏగూరి భాస్కర్‌లపై పీడీ చట్టం ప్రయోగించారు. బుధవారం జిల్లాకలెక్టర్ టి.బాబూరావునాయుడు ఈ ఐదుమందిపై పీడీ చట్టం కింద నిర్భంధ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఐదుమంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఉండి, ఆయా దేశాలకు వెళ్లి వచ్చేవారని పోలీసుశాఖ చెబుతోంది. షేక్ ముస్త్ఫా చెన్నైలోని తొండైర్ పేట్‌కు చెందిన వాడు. 40ఏళ్ల షేక్ ముస్త్ఫా నాలుగేళ్ల నుండి చెన్నైకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. వారి ద్వారా కడప, తిరుపతి, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు చెందిన అంతర్ రాష్ట్ర స్మగ్లర్లతో బంధం ఏర్పరచుకుని శేషాచలం, లంకమల, నల్లమల అటవీప్రాంతాలలోని ఎర్రచందనం చెట్లను నరికి చెన్నైకి రవాణాచేసి అక్కడి నుండి దుబాయ్ , సింగపూర్ ,మలేషియా దేశాలకు అక్రమరవాణా చేసేవారు. ఈనాలుగేళ్లలో కోట్లరూపాయలు అక్రమంగా ఆర్జించాడని పోలీసుల సమచారం, దుబాయ్‌లో ఉన్న అంతర్జాతీయ స్మగ్లర్ సాజితి ప్రధాన అనుచరుడయ్యాడు. వేది అలియాస్ వేది శక్తివేలుది కూడా తమిళనాడు రాష్ట్రంలోని సేలం, అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సేతుమాధవనం ఆర్క్ఠాభాయ్ , అనేకట్ బాబులకు ఇతను నమ్మకస్తుడు. ఇతనిపై కడప జిల్లాలో 19 కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. విశ్వనాధన్ స్వస్థలం తిరువన్నామళై అయితే ప్రస్తుతం వేలూరులో ఉంటున్నాడు. ఐదేళ్ల నుండి ఎర్రచందనం అక్రమరవాణాలో ముమ్మురంగా పనిచేస్తున్నాడు. ఇతనికి అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. నాలుగవ వాడైన కామేష్ స్వస్థలం కూడా చెన్నై సిటీనే. ఇతనిపై కూడా కడప జిల్లాలో 19 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. ఇతను సేతుమాధవన్, యతిరాజుల శ్రీనివాసులు నాయుడులతో కలిసి దుబాయ్‌లో ఉన్న అలీభాయ్‌కి ఎర్రచందనం ఎగుమతి చేస్తుంటాడు. 5వ వాడైన ఏగూరి భాస్కర్ అలియాస్ ప్రసాద్ స్వస్థలం చిత్తూరు జిల్లా వేర్పేడు. ఇతను ఆరు సంవత్సరాలు నుండి ఎర్రచందనం అక్రమరవాణాలో చురుకుగా పనిచేస్తున్నాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ప్రణబ్ కుమార్ దేవ్ బర్మన్‌కు ఇతను ప్రధాన అనుచరుడు , కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో భాస్కర్‌పై 21 కేసులు నమోదై ఉన్నాయి. ఈ 5 మందిపై ఎస్పీ పీడీ చట్టం ప్రయోగించారు. గతనెలలో ముగ్గురిపై , ఈనెలలో వీరిపై పీడీ చట్టం ప్రయోగించిన ఎస్పీ, ఎర్రచందనం స్మగ్లర్లకు నిద్రలేకుండా చేస్తున్నారనే ప్రశంసలు విన్పిస్తున్నాయి.