గుంటూరు

నయవంచక మోదీ మెడలు వంచి హోదా తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిడుగురాళ్ల, ఏప్రిల్ 25: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, తిరగబడ్డ తెలుగోడా అనే నినాదాలతో బుధవారం పట్టణం హోరెత్తింది. పట్టణ తెలుగుదేశం శ్రేణుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ పట్టణంలో భారీ బైకు, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు సాగిన ర్యాలీలో యరపతినేని స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు తిరుపతి సభలో వెంకన్న సాక్షిగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తానన్న మోదీ నేడు హోదా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. చంద్రబాబు ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమని, హోదా కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పాండురంగ శ్రీను, మున్సిపల్ చైర్‌పర్సన్ భవసాని హైమావతి యల్లారావు, వైస్ చైర్మన్ అద్దంకి రత్నాకరరావు, సొసైటీ బ్యాంకు డైరెక్టర్ వడ్లవల్లి సర్వేశ్వరరావు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అమీర్‌అలీ, జిల్లా తెలుగుయువత నాయకులు రామకృష్ణ, బిక్షు చౌదరి, కౌన్సిలర్లు రవి, కొండలు, అంబటి హనుమంతరావు, సాంబశివరావు, ఫరీద్ మేస్ర్తీ, ఖాదర్‌వలి, టీడీపీ బాషా తదితరులు పాల్గొన్నారు.

వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం
పెదనందిపాడు, ఏప్రిల్ 25: మండల పరిధిలోని నాగులపాడు ఎల్‌ఎంహెచ్ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరం ప్రారంభమైంది. శిబిరాన్ని తొలుత జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, శాసనమండలి సభ్యుడు ఎఎస్ రామకృష్ణ ప్రారంభించారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు కుమార్తె రాధిక ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా స్పోకెన్ ఇంగ్లీషు, గణితం, కంప్యూటర్, ఆర్ట్స్ అండ్ క్రాప్ట్, కబాడ్డీ, వాలీబాల్‌లో నెల రోజుల పాటు విద్యార్థులకు శిక్షణా తరగతులు జరగనున్నాయి. పలు రంగాల్లో విద్యార్థులకు ప్రావీణ్యం కల్పించేందుకు దోహద పడుతుందని జానీమూన్ అన్నారు. విద్యార్థులకు మేథోశక్తి పెంపొందించుకునేందుకు శిక్షణ ఉపకరిస్తుందన్నారు. దాతలు సహృదయంతో ఏర్పాటుచేసిన వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని శాసనమండలి సభ్యుడు ఎఎస్ రామకృష్ణ విజ్ఞప్తిచేశారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటే ఆశించిన లక్ష్యాన్ని సాధించేందుకు అవగాహన ఏర్పడుతుందని విద్యార్థులకు సూచించారు. ఎంపీపీ నగరాజకుమారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రత్యేక హోదాపై మాటతప్పిన మోదీ
మేడికొండూరు, ఏప్రిల్ 25: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నాయకులు పోరాటం చేస్తామని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేసే ముందు మేడికొండూరు నుండి ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందనన్నారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. నరేంద్రమోదీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. అనంతరం యార్డు చైర్మన్ నార్నె శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ మానుకొండ ఆంజనేయులు చేత జీవీ ఆంజనేయులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం, మేడికొండూరు ఎంపీపీలు పెరికల అన్నమ్మ, మసీదు సలీమాబీ, జెడ్పీటీసీ సభ్యులు గుంటుపల్లి సాంబశివరావు, నాయకులు పాములపాటి శివన్నారాయణ, పసల థామస్, యాకుబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.