క్రైమ్/లీగల్

రావిపాడులో విగ్రహాల చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదనందిపాడు, ఏప్రిల్ 28: మండల పరిధిలోని రావిపాడులో ఉత్సవమూర్తుల విగ్రహాలు శుక్రవారం అపహరణకు గురయ్యాయి. పడమట రామాలయంలో గల సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివార్ల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. దాదాపు ఈ విగ్రహాల విలువ 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఓ ప్రవాస భారతీయుడు విరాళంగా ఈ విగ్రహాలను అందజేశారు. చోరీ విషయం తెలియడంతో ఎస్‌ఐ రామాంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుంటూరు నుండి వచ్చిన క్లూస్‌టీం వేలిముద్రలు స్వీకరించింది. కాగా 10 రోజుల క్రితం మండల పరిధిలోని పాలపర్రులో సూరేశ్వర సోమేశ్వర దేవస్థానంలో గల విగ్రహాలు చోరీకి గురైన విషయం పాఠకులకు విదితమే. వారం రోజుల వ్యవధిలో రెండు ప్రాంతాల్లో చోరీలు జరగడం పట్ల దేవస్థానాల పరిధిలో గల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.