తెలంగాణ

మే 10 నుండి రైతుబంధు పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, ఏప్రిల్ 29: రాష్ట్రంలో మే 10 నుండి రైతుబంధు పథకం కింద సుమారు 58 లక్షల మంది రైతులకు ఆరువేల కోట్ల రూపాయలు పెట్టుబడిని పంపిణీ చేసేందుకు చెక్కులు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్త సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ప్రతి 300 మంది రైతులకు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఆధార్ కార్డు, పాస్‌బుక్ జిరాక్స్‌లు సమర్పించి చెక్కులు పొందాలన్నారు. చెక్కులు పొందని వారు అనంతరం పొందవచ్చన్నారు. ఇంకా 96వేల మంది రైతులకు చెక్కులు సిద్ధం అవుతున్నాయన్నారు. చెక్కులు పొందిన రైతులు ఆర్ధిక స్తోమత కలిగి ఉన్న వారు వద్దనుకుంటే వారి చెక్కులను సమితి కార్యాలయంలో జమ చేస్తారన్నారు.
వారు కావాలంటే కౌలు రైతుకు కూడా ఇవ్వవచ్చన్నారు. కౌలురైతుల విషయంలో ఎలాంటి నిర్ణయం జరగలేదన్నారు. చెక్కులు తీసుకోని వారు తర్వాత కూడా తీసుకునే సౌకర్యం కల్పించామని ఇబ్బంది పడవద్దన్నారు. చెక్కుల పంపిణీపై ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులకు ఈ నెల30న నల్లగొండలో అవగాహన సదస్సు ఉంటుందన్నారు. సదస్సులో హాజరు కావాలన్నారు. సీఏం కేసీఆర్‌పై, ప్రగతిభవన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం అనుచితమన్నారు. ప్రగతి భవన్‌లో ప్రజల కోసం ఒక విభాగం, ఆయనకో నివాసం, అధికారుల కోసం ఒక విభాగం ఉందని సీఎం సొంతం కాదని, ఏ సీఎం వచ్చినా అందులోనే ఉంటారన్నారు. సీఎంగా వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు ఆయనో భవన నిర్మాణం చేశారని, అదే విధంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినా కిమ్మనని ఉత్తమ్‌కుమార్ నేడు కేసీఆర్‌పై విమర్శలు చేయడం తగదన్నారు. ఏ నాడు తెలంగాణా గురించి మాట్లాడని ఉత్తం నేడు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అనవసర వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీపీ ఒగ్గు జానయ్య, టీఆర్‌ఎస్ నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎ.నాగార్జునాచారి, మోహిసిన్‌అలి, డి.నారాయణరెడ్డి, వీరకోటిరెడ్డి, డి.చిట్టిబాబు, జడ్పీటీసీ ఇ.పద్మ పాల్గొన్నారు.