తెలంగాణ

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 29: భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఆపార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి నియమితులయ్యారు. ఈనెల 25 నుంచి 29వరకు కేరళ రాష్ట్రంలోని కొల్లాం లో నిర్వహించిన ఆ పార్టీ జాతీయ మహాసభల్లో ప్రకటించిన నూతన కార్యవర్గంలో ఆయనకు చోటు లభించింది. జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ఆయన రాజకీయ ప్రస్థానం ఆ గ్రామం నుంచే మొదలైంది. సర్పంచ్ నుంచి మొదలు ఎంపిపిగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా, పిఎసి సభ్యునిగా కూడా కొనసాగారు. సహకార పితామహుడు అనభేరి వెంకటరమణారావును ఆదర్శంగా తీసుకుని, రాజకీయాల్లోకి వచ్చిన ఆయన జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఎన్నిక కావటం పట్ల ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, సహాయ కార్యదర్శి అందె స్వామి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొయ్యడ సృజన్‌కుమార్, నాయకులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి, బూడిద సదాశివ, కూన శోభారాణి, గూడెపు లక్ష్మి, గడిపె మల్లేశ్, గురాల హన్మిరెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.