తెలంగాణ

ప్రజా సమస్యలు పట్టని కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: ప్రజాసంక్షేమం, పేదల అభివృద్ధి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని, పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ చరిస్మా పల్లెపల్లెల్లో విస్తరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశం, అనంతరం కర్నాటకలో ప్రచారానికి వెళ్లే ముందు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ప్రధాని అయ్యే నాటికి 40 శాతం దేశ జనాభాకు కనీసం మరుగుదొడ్లు కూడా లేవని, మోదీ ప్రధాని అయ్యాక ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రతి ఇంటికీ 12వేల రూపాయిలు ఇస్తున్నారని అన్నారు. మహిళల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న మరుగుదొడ్లను నిర్మించి వాటిని ఆత్మగౌరవాలయాలుగా నామకరణం చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని అన్నారు. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిన చందంగా తెలంగాణలో ప్రజల సమస్యలను పరిష్కరించలేని కేసీఆర్ ఢిల్లీలో భూంకంపం సృష్టస్తామనడం థర్టు ఫ్రంట్ పెట్టి దేశాన్ని పాలిస్తాననడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఏమీ చేయలేని కేసీఆర్ ఢిల్లీ వెళ్లి దేశానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. సచివాలయానికి కూడా రాని ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తామనడం నిజంగా విడ్డూరంగా ఉందని అన్నారు. దేశాన్ని రెండు పార్టీలే పాలించాలా? అంటున్న కేసీఆర్ తెలంగాణను ఒకే కుటుంబం పాలిస్తోందని పేర్కొన్నారు. మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
టీఆర్‌ఎస్ సర్కార్ కుట్ర
చైన్నైలో కరుణానిధి వ్యవహారం బెడిసికొట్టిందో ఏమో గానీ మొత్తానికి నిన్నటి వరకూ థర్టు ఫ్రంట్ అంటూ బీరాలు పలికిన సీఎం కేసీఆర్ థర్టు ఫ్రంట్ అనేది మీడియా సృష్టి అంటూ ఉన్నపళంగా మాట మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు. సోమవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ దేశాన్ని సుభిక్షమైన ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. అంతకుముందు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ చీటికీ మాటికీ సీఎం కేసీఆర్ రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలు గురించి చెబుతున్నారని, రాజ్యాంగాన్ని పూర్తిగా చదువుకోవాలని అన్నారు. పదే పదే స్వేచ్ఛ కావాలంటున్న కేసీఆర్ ముందు రాజ్యాంగాన్ని అవగాహన చేసుకోవాలని హితవుపలికారు.
కర్నాటకలో ప్రచారం
గుల్బర్గా దక్షిణ ప్రాంతంలోని జగత్ సర్కిల్ గుబ్బి ప్రాంతంలో డాక్టర్ కే లక్ష్మణ్ సోమవారం నాడు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. తెలుగువారితో ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా మాట్లాడారు. బీజేపీకి ఓటు వేస్తేనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ప్రజల సంక్షేమానికి బీజేపీ పెద్ద పీట వేసిందని అన్నారు.