తెలంగాణ

క్లాసులు పెట్టిన కాలేజీలకు తాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న జూనియర్ కాలేజీలపై టాస్క్ఫోర్సుల దాడులు కొనసాగుతున్నాయి. ఇంత వరకూ 396 కాలేజీలకు ఈ బృందాలు మూత వేయగా, సోమవారం మరో 47 జూనియర్ కాలేజీలకు తాళాలు వేశారు. హైదరాబాద్ జిల్లాలో 18 కాలేజీలకు, రంగారెడ్డి జిల్లాలో 14 కాలేజీలకు, మేడ్చెల్ జిల్లాలో 15 కాలేజీలకు మూత వేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ సోమవారం నాడు మీడియాకు చెప్పారు. కాగా 27 తనిఖీ బృందాలు విద్యార్థుల నుండి ఫిర్యాదులను స్వీకరించి ఐదు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి వేసవిలో తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలకు తాళాలు వేస్తోందని పేర్కొన్నారు. ఈ కాలేజీలు అన్నింటికీ నోటీసులు జారీ చేశామని, అనుబంధ గుర్తింపు ఎందుకు రద్దు చేయరాదో వెంటనే వివరణ ఇవ్వాలని కోరామని తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో మేడ్చెల్ జిల్లా ఇంటర్ విద్యాధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో తొలి విడతలో 25, రెండో విడతలో 25కాలేజీలకు, మూడో విడతలో 18, నాలుగో విడతలో 18 కాలేజీలకు తాళా లు వేశామని, హైదరాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి జయప్రద ఆధ్వర్యంలో తొలి విడతలో 13, రెండో విడతలో 16 కాలేజీలకు, మూడో విడతలో 19, నాలుగో విడతలో 09 కాలేజీలకు తాళాలు వేశామని బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారి వెంకయ్య నాయక్ ఆధ్వర్యంలో తొలి విడత 8 కాలేజీలకు, రెండో విడత 14 కాలేజీలకు , మూడో విడతలో 10 కాలేజీలకు , నాలుగో విడతలో 12 కాలేజీలకు తాళాలు వేశామని అశోక్ సోమవారం వివరించారు.

4న ఆర్టీసీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ
హైదరాబాద్, ఏప్రిల్ 30: ఆర్టీసీలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మే4న ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ఉద్యోగుల రాష్ట్ర మహాసభను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం బస్ భవన్ వద్ద ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరినాధ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రియంబర్స్‌మెంట్, 2014 నుంచి రావాల్సిన వేతన బకాయిలను చెల్లించడంతో ఇళ్ల స్థలాలను కేటాయించాలని అనే అంశాలపై మహాసభలో చర్చిస్తామని తెలిపారు. జనాభాలో ఉన్న బీసీలు ఇంకా వివక్షతకు గురి అవుతూనే ఉన్నారని ఆవేధన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం అన్ని శాఖల్లోని ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని వివరించారు.