తెలంగాణ

విద్యా సంస్థల దోపిడీపై ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టక పోతే రాష్టవ్య్రాప్తంగా ఉద్యమిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరింరు. సోమవారం బీసీ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఇంటర్ అడ్మిషన్లను డిగ్రీ అడ్మిషన్ల మాదిరిగా కేంద్రీకృత పద్దతిలో ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా కార్పోరేట్ కాలేజీలు విచ్చల విడిగా అడ్మిషన్లు జరుపుకుంటూ తల్లిదండ్రుల వద్ద నుంచి లక్షలాధి రూపాయాలను వెనకేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇంటర్ విద్యలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలంటే ప్రభుత్వమే అడ్మషన్ల ప్రక్రియను నిర్వహించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యను వ్యాపారమయం చేసిన విద్యాసంస్థలను కృష్ణానది అవతలికి తరిమేస్తామని హెచ్చరించిన ముఖ్యమంత్రి మాటలను నెరవేరక పోవడం తల్లిదండ్రుల పాలిట శాపంగా మారిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రస్తుతం కార్పోరేట్ కాలేజీల దోపిడీ మూడింతలు పెరిగిందన్నారు. రాజ్యాంగ బద్దంగా ప్రజలకు విద్యా, వైద్యాన్ని ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వాలు ఆ పేరున కోట్లాది రూపాయలను వెనుకేసుకుంటున్న వారికి కొమ్ముకాయడం విచారకరమన్నారు. కేవలం వ్యాపార దృక్పధంతో విద్యా సంస్థలను కొనసాగిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో కలిసి రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.