తెలంగాణ

అకాల వర్షాలు.. ప్రభుత్వం హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: అకాల వర్షాలపై ప్రభుత్వం హైఅలర్టు ప్రకటించింది. తక్షణం నష్టాలను అంచనా వేయడానికి అధికారుల బృందాన్ని పంపాలని ప్రభుత్వం కలెక్టర్లును హెచ్చరించింది. ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు జరిగిన నష్టాలపై విడివిడిగా నివేదికలను పంపాలని ఉన్నతాధికారులు వౌలిక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు సంబంధిచిన మంత్రులు సైతం పంట నష్టాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పరిస్థితులను చక్కదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎండవేడిమితో సతమతం అవుతున్న ప్రజలు ఒక్కసారిగా వాతావరణం మార్పుతో ఊపిరి పీల్చుకున్నారు. గురువారం రాష్ట్ర రాజధాని సహా జిల్లాల్లో భానుడి వేడి ఒక్కసారిగా తగ్గి చల్లబడింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలు, వడగండ్లు, ఉరుములతో కూడిన వర్షాలు జోరుగా పడడంతో రాజధానిలో రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షంనీరు చేరడంతో ప్రజలు నానాహైరానా పడాల్సి వచ్చింది. మరో రెండురోజలు పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల శాఖ ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణలో అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంటలు మొక్కజొన్న, మామిడికాయలు నేలరాలాయని వాటితో పాటు ఇతర పంటలు భాగా దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తం అయ్యింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
వ్యవసాయశాఖతో పాటు ఉద్యానవన శాఖలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనావేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ల తక్షణం వ్యవసాయ మార్కెట్లను పరిశీలించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం రైతులకు భరోసా ఇవ్వాలని ఆయన సూచించారు. రహదార్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు, మిల్లర్లు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావాలని మంత్రి సూచించారు.