తెలంగాణ

కొత్త పంచాయతీ చట్టం.. గ్రామాల అభివృద్ధికి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: తెలంగాణలోని గ్రామాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కొత్తగా పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకువచ్చామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లాపరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు (సీఈఓ), జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ), మండల పంచాయతీ విస్తరణ అధికారులతో (ఈఓపీఆర్‌డీ) గురువారం ఇక్కడ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేస్తే గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. సుమారు 25 ఏళ్ల తర్వాత కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. చట్టాన్ని అమలు చేయడంలో అధికారులదే కీలకమైన బాధ్యత అని గుర్తు చేశారు.
కొత్త చట్టం ద్వారా సర్పంచ్‌లు, పాలక వర్గాలకు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చామని, అదే సమయంలో ఎవరైనా నిర్లక్ష్యంతో పనిచేసినా, తప్పు చేసినా శిక్షించేందుకు వీలుకల్పించామని జూపల్లి తెలిపారు. సర్పంచ్ లేదా గ్రామ కార్యదర్శి తప్పు చేస్తే జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని, దీనిపై మంత్రికి అప్పీలు చేసుకునే అవకాశం గతంలో ఉండేదని, కొత్త చట్టం ద్వారా అప్పీల్ చేసుకునేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటవుతోందన్నారు. గ్రామపంచాయతీలకు భవిష్యత్తులో ఆదాయం బాగా పెరుగుతుందని, అదే సమయంలో ఖర్చు తగ్గుతుందన్నారు. తాగునీటి సరఫరా బాధ్యత ఇప్పటి వరకు పంచాయతీలపై బాధ్యత ఉండేదని, ఇక నుండి ప్రభుత్వమే ఈ బాధ్యత చేపడుతోందన్నారు. గ్రామాల్లో బీటీరోడ్లు, సీసీ రోడ్లను ప్రభుత్వమే వేస్తోందని జూపల్లి తెలిపారు. పచ్చదనం-పరిశుభ్రత బాధ్యతలను పంచాయతీలకే ఇచ్చామని మంత్రి జూపల్లి తెలిపారు. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉందని, వారంరోజుల్లో ఇందుకోసం స్థలాన్ని సేకరించాలన్నారు. కొత్తగా వచ్చే పాలకవర్గాలు పదవీబాధ్యతలు చేపట్టిన మూడేళ్ల కాలంలో వందశాతం అక్షరాస్యత సాధించాలని, వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను పాలకవర్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పశుసంరక్షణ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాలలో హరితహారం చేపట్టేబాధ్యత సంబంధిత గ్రామపంచాయతీ కార్యవర్గాలపైనే ఉంటుందని వివరించారు. రోడ్లు, మురుగునీటికాలువలు నిర్మాణం నిర్వహణతో పాటు పబ్లిక్ స్థలాల్లో చెత్తవేస్తే 500 రూపాయల వరకు జరిమానా విధించే అధికారం సర్పంచ్‌లకే ఇచ్చామన్నారు. హరితహారంలో నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలైనా జీవించే విధంగా చర్యలు తీసుకునే బాధ్యత సర్పంచ్‌లపైనే ఉంటుందన్నారు. లేఅవుట్ల ఆమోదం, భవన నిర్మాణ అనుమతులను పంచాయతీ పాలక వర్గాలే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కొత్త చట్టం ప్రకారం చెక్‌పవర్ బాధ్యత సర్పంచ్‌లతో పాటు ఉపసర్పంచ్‌లకు ఉంటుందన్నారు.పంచాయతీరాజ్ శాఖ కొత్త పౌరసేవల వెబ్‌సైట్‌ను ఈ సందర్భంగా మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ఇంటిపన్ను, భవన నిర్మాణ అనుమతులు, మ్యుటేషన్, ట్రేడ్ లైసెన్స్‌ల జారీ, రెన్యూవల్, లేఅవుట్ల అనుమతి మంజూరు చేసేందుకు వీలుందన్నారు. ఈ సదస్సులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతా కుమారి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ పి. రామారావు, సిపార్డ్ అధికారలు నరేంద్రనాథ్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.