తెలంగాణ

బీజేపీ తాజా స్థితిపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో పట్టుసాధించాలని భావిస్తున్న బీజేపీ తాజాపరిస్థితిని శనివారం నాడు నగరానికి వస్తు న్న కేంద్ర రహదారులు, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్, శాసనసభాపక్ష నాయకుడు కిషన్‌రెడ్డి, శాసనమండలి సభ్యుడు రామచంద్రరావు, శాసనసభాపక్షం ఉప నాయకుడు రామచంద్రారెడ్డితో భేటీ అవుతారు. ఉదయం 11 గం టలకు నితిన్ గడ్కరీ నగరానికి చేరుకుంటారు. రామాంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో జరిగే నాలుగు జాతీయ రహదారుల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. రూ.1532 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పథకాల్లో హైదరాబాద్ బెంగలూరు రహదారిలో ఆరాంఘడ్ - శంషాబాద్ మధ్య ఆరు లైన్ల రహదారిగా విస్తరిస్తారు. ఎన్ హెచ్ 765డిలో హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుండి మెదక్ వరకూ ఉన్న భాగాన్ని స్థాయి పెంచుతారు. అంబర్‌పేట ఎక్స్ రోడ్ నుండి నాలుగు రహదార్ల ఫ్లయఓవర్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఎన్‌హెచ్ 163లో భాగమైన హైదరాబాద్ - భూపాలపట్నం సెషన్‌లో ఉప్పల్ మొదలు నారపల్లి వరకూ ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు చేపడతారు. అం తకుముందు ఆయన హోటల్ మారియట్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో విజయక్రాంతి దినపత్రికను ప్రారంభిస్తారు. 2 గంటలకు టీడీపీ , కాంగ్రెస్‌ల నుండి కొంత మంది నేతలు బీజేపీలో నితిన్ గడ్కరీ సమక్షంలో చేరుతారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయండి
హైదరాబాద్, మే 4: అగ్రిగోల్డ్ సంస్థలో తమ సొమ్ముదాచుకున్న వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు దిక్కూమొక్కూ లేక ఆర్తనాదాలు చేసున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుంభవన్‌లో అగ్రిగోల్డ్ బాధితుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాడ వెంకట్‌రెడ్డి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. కూలినాలి చేసుకొని బతికే పేదల నుండి మధ్యతరగతి, ఉద్యోగులు, చిరువ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగులు అగ్రిగోల్డ్‌ను నమ్మి డబ్బు దాచుకొని నేడు ఆర్థికంగా చితికిపోయారని అన్నారు. తాము ఎన్నో కష్టనష్టాలకోర్చి దాచుకున్న సొమ్ము తిరిగి రాదన్న బెంగతో పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం సత్వరమే ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ ఫెడరేషన్ కన్వీనర్‌గా కొన్‌రెడ్డి వెంకటరెడ్డి, కో-కన్వీనర్‌గా చింతర్యాల రామారావును ఎన్నుకున్నారు.
బాధితులను ఆదుకోవాలి
రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా పంటలు పాడవడంతో పాటు ప్రాణనష్టం జరిగిందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే చర్యలు ప్రారంభించాలన్నారు.