రాష్ట్రీయం

ఉమ్మడి కమిటీని నియమించిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలిక్కి రానున్న విద్యుత్ ఉద్యోగుల వివాదం
హైదరాబాద్, మార్చి 11: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ ఉద్యోగుల వివాదాన్ని పరిష్కరించేందుకు హైకోర్టు ఒక ఉమ్మడి కమిటీని నియమిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీ మార్గదర్శకాలను ఖరారు చేస్తుంది. ఈ కమిటీలో పది మంది అధికారులు ఉంటారు. వీరు మార్గదర్శకాలను ఈ నెల 31వ తేదీలోపల ఖరారు చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఈ కమిటీకి ఒక రిటైర్డు జడ్జిని నియమించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియను పూర్తి చేస్తామని హైకోర్టు తెలిపింది. మార్గదర్శకాలను రిటైర్డు జడ్జి పరిశీలించి అవసరమైతే వీటిని సవరించి అమలు చేసేందుకు వీలుగా హైకోర్టుకు నివేదిక ఇస్తారు. విద్యుత్ ఉద్యోగుల పంపకం సాఫీగా జరిగేందుకు వీలుగా ఉమ్మడి కమిటీ అన్ని చర్యలు తీసుకుంటుందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం పేర్కొంది.