తెలంగాణ

హోంగార్డులను విధుల్లోకి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: హోంగార్డులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. 2011లో అప్పటి ప్రభుత్వం 250 మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించిందన్నారు. సోమవారం నాడు తమను విధుల్లోకి తీసుకోవాలని హోంగార్డు కుటుంబాలు నిరసన తెలియచేస్తూనే, హోర్డింగులపైకి ఎక్కి ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో హోంగార్డులకు వివిధ ప్రజా సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. గత మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హోంగార్డులను విధుల్లోకి తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రెండు నెలలు గడిచినా సీఎం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. గతంలో హోంగార్డులకు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రభుత్వ సహాయం అందడంలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుతో మంచి జరుగుతుందిని హోంగార్డులు ఆశించారని, అయితే వాస్తవంగా ఎలాంటి సహాయాలు అందకపోవడంతో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిదేళ్లుగా గ్రూప్ 1తో పాటు మిగతా శాఖల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అత్యవసర శాఖల్లో కూడా ఉద్యోగ భర్తీలు చేయడం లేదన్నారు. డైరె క్ట్ రిక్రూట్‌మెంట్ కోటా కింద పోస్టులను ఆయా శాఖల ఉన్నతాధికారులు తాత్కాలిక ప్రమోషన్లు ఇచ్చి కొనసాగించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భర్తీలు లేక పోవడంతో సచివాలయంలో ఖాళీగా కుర్చీలు కన్పిస్తున్నాయని విమర్శించారు. సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, కోట్ల శ్రీనివాస్, చెరుకుల రాజేందర్, కృష్ణయాదవ్, శ్రీమతి రమ్య, అనంతయ్య పాల్గొన్నారు.