బిజినెస్

నీరవ్ మోదీ స్కాంలో రెండో చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 16: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను నీరవ్ మోదీ, అతని సహచరులు మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం రెండో చార్జిషీట్‌ను దా ఖలు చేసింది. నీరవ్ మోదీ మామ మెహుల్ చోక్సీ పాల్పడిన కుంభకోణం మొత్తం రూ. ఏడు వేల కోట్లని సీబీఐ తన చార్జిషీట్‌లో పే ర్కొంది. ఇందులో రూ. 512 కోట్లకు సంబంధించిన లెటర్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎల్‌ఓయూలు)ల కు సంబంధించిన ఆధారాలను సీబీఐ సేకరించింది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 409, 420 సెక్షన్ల కింద సీబీఐ ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. సీబీఐ ఈ తాజా చార్జిషీట్‌లోనూ పీఎన్‌బీ మాజీ సీఈఓ, ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్‌ను నిందితురాలిగా పేర్కొంది. ప్రస్తుతం ఆమె అలహాబాద్ బ్యాంక్ సీఈఓ, ఎండీగా పనిచేస్తున్నారు. ఆమెతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేవీ బ్రహ్మాజి రావు, సంజీవ్ శరణ్, ఇంటర్నేషనల్ బ్యాం కింగ్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ ఇన్‌చార్జి నెహల్ అహద్‌లను నిందితులుగా చార్జిషీట్‌లో పేర్కొంది. సీబీఐ 50 మంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా 12 లావాదేవీలను పేర్కొంటూ చోక్సీని నిందితుడిగా చార్జిషీట్‌లో పేర్కొంది. సీబీఐ మూడు సంస్థలు- గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, గిల్లి ఇండియా లిమిటెడ్, నక్షత్ర బ్రాండ్ లిమిటెడ్‌లపై కూడా అభియోగాలు నమోదు చేసింది.