ఆంధ్రప్రదేశ్‌

మా గోడు పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: రాష్ట్రంలోని లక్షా 84వేల మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) పరిధిలోని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల గోడును ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవటం పట్ల వారిలో అసంతృప్తి పెరుగుతోంది. వేసవిలో సైతం వీరంతా సీపీఎస్ ఎంప్లారుూస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు దశల్లో పలు రకాల ఉద్యమాలు సాగిస్తూ వచ్చారు. అయితే తాజాగా బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో కనీసం వీరి ప్రస్తావన కూడా లేకపోవటంతో వీరంతా మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామాంజనేయులు యాదవ్ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ త్వరితగతిన తమ విషయమై సరైన నిర్ణయం తీసుకోని పక్షంలో ఈ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదంటూ హెచ్చరించారు. సీపీఎస్ ఉద్యోగులతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంపై ముందుగా లక్షలాది మంది ఉద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్నారు. అయితే పాత బకాయిలు, పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, 9 నెలలుగా పరిష్కారానికి నోచుకోని 2002 డీఎస్సీ హిందీ పండిట్ల సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదు. మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా వ్యవస్థపై కనీస చర్చ కూడా జరగలేదు.