క్రైమ్/లీగల్

చిట్టీల పేరుతో రూ.1.60 కోట్లు వసూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 16: చిట్టీల పేరుతో తెలిసిన వారి నుంచి దాదాపు రూ. 1.60కోట్లు వసూలు చేసుకుని పరారైన మహిళను, ఆమె కుటుంబ సభ్యులను స్థానికులు పట్టుకుని ఈస్ట్ పోలీసులకు అప్పగించారు. తిరుపతి కొర్లగుంట సంజయ్‌గాంధీ కాలనీకి చెందిన జ్యోతి డ్వాక్రా సంఘంలో పనిచేస్తోంది. స్థానికంగా అందరితో బాగా పరిచయాలున్న ఆమె తొలుత చిన్న చిన్న చీట్టీలు వేసేది. కాగా కొంత కాలంగా పెద్దమొత్తంలో చిట్టీలు వేస్తోంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా దాదాపు రూ.కోటి 60 లక్షలు వసూలు చేసుకుని ఎవరికీ చెప్పకుండా ఉడాయించే ప్రయత్నం చేసింది. తన భర్త, కొడుకుతో కలిసి ఊరు వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఆమెను, ఇతర కుటుంబ సభ్యులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు. కాగా మరో కథనం మేరకు జ్యోతి కొద్ది రోజుల క్రితమే తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు పరారవగా, ఆమె వద్ద చిట్టీలు వేసి వారు బెంగళూరు వెళ్లి ఆమెను తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారని చెబుతున్నారు.