క్రైమ్/లీగల్

భూ తగాదాలో రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లందకుంట, జూన్ 19: మండలంలోని సిరిసేడు గ్రామంలో ఓ భూ తగాద విషయంలో రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవరం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బీసు నిర్మల, తిరుపతిలకు పూర్వీకుల నుంచి వచ్చిన 34 గుంటల భూమి ఉంది. కాగా గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ సాగు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా తిరుపతికి చెందిన 34 గుంటల భూమి వివరాలు పట్టాదారు పాసు పుస్తకంలో 24 గుంటల భూమిగా మాత్రమే వచ్చింది. గ్రామంలోని రజకులకు 3 ఎకరాల 3 గుంటల భూమి ఉండాలి. కాగా, తనకు సంబంధించిన భూమిని అక్రమంగా రజకులు ఆక్రమించుకొని సాగు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా ఫలితం లేకపోవడంతో రైతు దంపతులు వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రైతు దంపతులు మాట్లాడుతూ పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని కబ్జా చేసి కొంతమంది వ్యవసాయం సాగు చేస్తున్నారని అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కాగా ఆత్మహత్యయత్నానికి పాల్పడిన బాధితులను తహసీల్దార్ రమేష్ పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.