బిజినెస్

ఓడిపోయిన డాక్టర్ రెడ్డీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: ఒక క్యాన్సన్ మందుపై పేటెంట్ హక్కుకేసులో డాక్టర్ రెడ్డీస్‌కు వ్యతిరేకంగా అమెరికా కోర్టు తీర్పు చెప్పింది. అమెరికాలో వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులకోసం ఉపయోగించే ‘అలిమ్టా’ (కీమోథెరపీకి ఉపయోగించే ఇంజెక్షన్- దీని కంపెనీ బ్రాండ్ పేరు పెమెట్రిక్స్‌డ్)) ఔషధంపై పేటెంట్ హక్కు కోసం ఎలి లిల్లీ, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల మధ్య అమెరికాలోని ఇండియానా కోర్టులో వివాదం నడిచింది. అయితే ఈ వివాదంలో తనకే కోర్టు అనుకూలంగా తీర్పు చెప్పినట్టు ఎలీ లిల్లీ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘ అలిమ్‌టా కీమోథెరపీ ఇంజెక్షన్‌పై ఎలి లిల్లీ పేటెంట్ హక్కులు 2022, మే నెలకు ముగుస్తాయి. అయితే డాక్టర్ రెడ్డీస్ దీనికి ప్రత్యామ్నాయ ఔషధాలను కంపెనీ పేటెంట్ హక్కులు ముగియకుండానే మార్కెట్లోకి ప్రవేశపెడతామనడం నిబంధనలకు విరుద్ధం’ అని కోర్టు పేర్కొంది. జూన్ 15న ఎల్ లీల్లీ, హస్పిరా ఇన్‌కార్పొరేషన్‌ల మధ్య జరిగిన వివాదంలో కూడా జిల్లా కోర్టు ఎలీ లిల్లీ కంపెనీకే అనుకూలంగా తీర్పు చెప్పడం గమనార్హం. తాజా కోర్టు తీర్పుతో డాక్టర్ రెడ్డీస్, హోస్పిరా కంపెనీలు కీమోథెరపీకి సంబంధించి ప్రత్యామ్నాయ ఔషధాలను, ఎలీ లీల్లీ పేటెంట్ హక్కులు ముగిసేవరకు మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి వీల్లేదు. 2017 అక్టోబర్‌లో జరిగిన అల్‌మిటాకు సంబంధించిన పేటెంట్ హక్కు విచారణ సందర్భంగా యుఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ కంపెనీకే అనుకూలంగా తీర్పు చెప్పడం గమనార్హం.