క్రైమ్/లీగల్
విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నల్లగొండ రూరల్, జూలై 7: నల్లగొండ పట్టణంలో అర్ధరాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. శనివారం వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రహమత్‌నగర్‌కు చెందిన చేరాల శ్రీనివాస్ (24), చేరాల ఆనంద్ (20)లు చదువుకుంటూ పార్ట్‌టైంగా పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కాగా శుక్రవారం రాత్రి ఈదురుగాలులు రావడంతో సర్వీసు తీగలు తెగి విద్యుత్ సరఫరా ఇంట్లోకి నిలిచిపోయింది. ఈక్రమంలో శ్రీనివాస్ తీగను పక్కకు తొలగించడానికి వెళ్లగా విద్యుత్ సరఫరా అయి షాక్ కొట్టింది. అన్న శ్రీనివాస్‌ను కాపాడబోయిన తమ్ముడు సైతం విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందడంతో పట్టణం, కాగా వీరి స్వగ్రామం తిప్పర్తి మండలం పజ్జూరులో సైతం విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వాస్పతికి తరలించారు. తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.