రాష్ట్రీయం

అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 23: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అడ్డుకునేందుకే ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను అడ్డుకునేందుకు, భయానక వాతావరణం సృష్టించేందుకు బంద్‌లు, హర్తాళ్‌లను ప్రేరేపిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ బంద్‌కు ప్రజల సహకారం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయానికి నిరసనగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 15 పార్టీలకు చెందిన 126 మంది సభ్యులు మద్దతిస్తే వైసీపీ తప్పించుకు తిరిగిందని విమర్శించారు. పార్లమెంటులో ఓ ప్రాంతీయ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించడం దేశ చరిత్రలోనే ప్రథమమన్నారు ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగిన నేపథ్యంలో ప్రధాని మోదీ గ్రాఫ్ పూర్తిగా దిగజారిందని వ్యాఖ్యానించారు. రాష్టమ్రంతా ఉత్కంఠభరితంగా అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చను ఆసక్తిగా చూస్తుంటే ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారని విమర్శించారు. కేసుల మాఫీ కోసం బీజేపీతో జతకట్టి పార్లమెంటు నుంచి పరారయ్యారని ఎద్దేవా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ స్కాం ఆంధ్ర కావాలా? స్కీం ఆంధ్ర కావాలా అని నినదించి ఇప్పుడు పీకల్లోతు స్కాంలలో కూరుకుపోయిన ఆర్థిక నేరస్థుడితో చేతులు కలపటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అవిశ్వాసం పెడితే 80 మంది సభ్యుల్ని తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ట్విట్టర్‌కే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. రాజధాని భూ సమీకరణకు 98 శాతం మంది రైతులు ముందుకొచ్చారని, రెండు శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని గ్రహించకుండా పవన్ ప్రభుత్వాన్ని నిందించడం అవగాహ నారాహిత్యం అన్నారు. నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్‌లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలో చేరారని విమర్శించారు. రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ యూటర్న్ తీసుకున్నారని దీనివల్లే తమ పార్టీ వ్యతిరేకిస్తూ అవిశ్వాసం పెట్టిందని గుర్తుచేశారు. జగన్ బంద్‌లకు పిలుపునిస్తే ప్రజలు సహించరన్నారు.