ఆంధ్రప్రదేశ్‌

పోలవరాన్ని అడ్డుకుని చరిత్ర హీనులుగా మారొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 7: ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి నోటి దురదతో, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చేతి దురదతో జాతీయ ప్రాజెక్టు పోలవరంను అడ్డుకుంటూ చరిత్ర హీనులుగా మారొద్దని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 70వ సారి పోలవరం పై సోమవారం వర్చువల్ ఇన్‌స్పెక్షన్‌తో పనులు వేగవంతంగా జరిగేలా చూస్తుంటే ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి మార్నింగ్ వాక్.. ఈవినింగ్ వాక్‌లో, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఢిల్లీలో కూర్చుని పోలవరం పనులు ఏమీ జరగలేదనడం హాస్యాస్పదమన్నారు. 2019 ఫిబ్రవరి - మార్చి లోపు పోలవరం పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతుందన్నారు. దశాబ్దకాలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1.14 శాతం మాత్రమే పోలవరం డ్యామ్ సైట్‌లో పనులు జరిగితే గత నాలుగు సంవత్సరాల్లో తమ ప్రభుత్వ హయాంలో 43 శాతం పనులు జరిగాయన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ. 14,488 కోట్లు ఖర్చు చేయగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 9,352 కోట్లు ఖర్చు చేయగా, కేంద్ర ప్రభుత్వం రూ. 6,727 కోట్లు రీయింబర్స్ చేసిందని, రూ. 2,625 కోట్లు ఇంకా రావాల్సి ఉందన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వరా ఐదు నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తుంటే కనీసం ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్‌కు 187 టీఎంసీల నీళ్లు తేవడందేశ చరిత్రలోనే ఒక రికార్డన్నారు.
జలవనరుల శాఖకు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్ర జలవనరుల శాఖకు 2018 సంవత్సరానికి గ్లోబల్ వాటర్ కన్జర్వేషన్ అవార్డు దక్కిందన్నారు. ఈ నెల 21 నుంచి 23 వరకు ఢిల్లీలో జరగనున్న ప్రపంచ వాటర్ సమ్మిట్‌లో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారన్నారు. ఈ అవార్డుకు 29 రాష్ట్రాలు పోటీపడితే మన రాష్ట్రానికి దక్కడం మన సామర్థ్యానికి గుర్తింపు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 4 సంవత్సరాల కష్టానికి నిదర్శమన్నారు. రాష్ట్రంలో -15 శాతం వర్షపాతం తక్కువ పడగా, రాయలసీమలో -45 శాతం తక్కువగా వర్షపాతం నమోదయ్యిందన్నారు. ఇ రాష్ట్రంలో 20 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా 19 లక్షల హెక్టార్లలో పంటలు వేశారని వాటికి సకాలంలో నీటిని అందించడమే కాకుండా పంటను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.