తెలంగాణ

క్రీడాపాఠశాలల్లో కోచ్‌ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: గిరిజన సంక్షేమ శాఖ ఆదిలాబాద్ జిల్లా జాతర్ల, భూపాలపల్లి జిల్లా ఎటూరు నాగారంలలో నిర్వహిస్తున్న క్రీడాపాఠశాలల్లో కోచ్‌ల నియామకానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ క్రీస్టినా జడ్ చంగ్తు తెలిపారు. అర్హులు గిరిజన సంక్షేమ శాఖ అకడమిక్ సెల్‌లో దరఖాస్తులు అందించాలని, లేకుంటే మెయిల్ చేయవచ్చని ఇతర వివరాలకు 9247267050 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.
ప్రవేశపరీక్ష
ఐఎఎస్ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీ 2018-19 బ్యాచ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ నెల 12వ తేదీ నిర్వహిస్తున్న ప్రవేశపరీక్షకు హాజరుకావాలని ఆ శాఖ ఇన్‌ఛార్జి డైరెక్టర్ వీ సర్వేశ్వరరెడ్డి తెలిపారు. అభ్యర్ధులు స్టడీసర్కిల్ డాట్ సీజీజీ డాట్ జీవోవీ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్ నుండి తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సులు, పీజీ కోర్సులు, డిప్లొమో కోర్సులు, సర్ట్ఫికేట్ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు గడువును సెప్టెంబర్ 5వ తేదీ వరకూ పొడిగించినట్టు అధికారులు తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు ఇతర వివరాలను వర్శిటీ వెబ్ పోర్టల్‌లో ఉంచామని వర్శిటీ అధికారులు చెప్పారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మంజూరు
రాష్ట్రంలో 6603 జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పోస్టులను కొత్తగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాతీలను పటిష్టం చేసేందుకు ఈ కొత్తపోస్టులను మంజూరు చేసినట్టు పంచాయితీ రాజ్ శాఖ పేర్కొంది.