గుంటూరు

మైనార్టీలకు అధిక నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 10: నవ్యాంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీలకు అధికనిధులు కేటాయిస్తూ వారి అభ్యున్నతికి కట్టుబడి ఉందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మైనార్టీలకు కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయని, తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అన్ని విధాలా ఆదుకున్నామన్నారు. వైఎస్ పాలనలో 13 జిల్లాలతో కూడుకున్న సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీలకు కేవలం 457 కోట్లు మాత్రమే కేటాయించారని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 13 జిల్లాలతో కూడుకున్న నవ్యాంధ్రప్రదేశ్ 2,346 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. ఒక్కో జిల్లాకు 45 కోట్లు కేటాయించి మైనార్టీల అభ్యున్నతికి కృషిచేశారన్నారు. ఎన్నడూ లేనివిధంగా దూదేకుల ముస్లింలకు బడ్జెట్‌లో 40 కోట్లు కేటాయించి ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో 3727 మంది ముస్లిం యువతులకు దుల్హాన్ పథకం కింద 18.63 కోట్లు ఖర్చుచేశామన్నారు. 54 మంది విద్యార్థులను విదేశీ విద్యాపథకం ద్వారా విదేశాలకు పంపించడం, 111 కోట్లతో 61,018 మందికి స్కాలర్‌షిప్ ఇస్తున్నామన్నారు. 37 షాదీఖానాలు, 17 మసీదులు నిర్మిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లాలో 519 మంది ఇమాం, వౌజాన్‌లకు ప్రతినెలా క్రమం తప్పకుండా గౌరవ వేతనం అందిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లాకు అత్యంత సమీపంలో హజ్ హౌస్‌ను నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలోనే కాకుండా రాష్టమ్రంతటా మైనార్టీలందరూ తెలుగుదేశంకు అండగా ఉన్నారని, 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమన్నారు. ఈనెల 28న జరిగే మైనార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జీవీ కోరారు.

ఎంప్లారుూస్ యూనియన్ కూటమి విజయం కార్మికులదే
* ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు
గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 10: ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లారుూస్ యూనియన్ కూటమి విజయం కార్మికుల విజయమేనని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో ఎన్‌ఎంయుపై ఎంప్లారుూస్ యూనియన్ మహాకూటమి ఘన విజయం సాధించిందన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్‌ఎంయును గెలిపించడానికి ప్రభుత్వంలో బాధ్యుడుగా ఉంటూ మంత్రిస్థాయిలో ఉన్న అచ్చెన్నాయుడు, అనేక రకాల యుక్తులు, పన్నాగాలు పన్నారన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినప్పటి నుండి ఎన్‌ఎంయుకు అచ్చెన్నాయుడు కొమ్ముకాశారన్నారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 19 శాతం ఐఆర్ ప్రకటించారన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్టీసీ 650 కోట్ల నష్టం నుంచి లాభాల బాట పట్టిందన్నారు. 60 వేల మంది కార్మికులు ఉండగా ప్రస్తుతం 50 వేల మంది మాత్రమే ఉన్నారు. ఆక్యుపెన్సీ రేషియో 55 నుంచి 65 శాతంకు పెరిగిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయగల శక్తి ఎంప్లారుూస్ యూనియన్‌కే ఉందన్నారు. రాబోయే రోజుల్లో పోరాటాలకు స్ఫూర్తిగా ఈవిజయం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట మాల్యాద్రి, హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

కురిసిన వర్షం ప్రత్తికి ప్రాణం పోసింది
పెదనందిపాడు, ఆగస్టు 10: నెల రోజులకు పైగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఖరీఫ్ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. కొంతమంది పత్తి విత్తనాలు, మరికొంత మంది భూములు విత్తనాలు నాటేందుకు చదును చేశారు. ఈ క్రమంలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మొలిచిన పత్తి మొక్కలు వడబడిపోతున్నాయి. డ్రమ్ముల్లో నీళ్లు తీసుకెళ్లి మొక్కలకు పోస్తూ పంటను రక్షించేందుకు రైతులు నానా ఇక్కట్లుపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మండల పరిధిలోని 18.4 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో రైతాంగంలో ఆశలు చిగురించాయి. వర్షంలోనే తడుస్తూ పలువురు రైతులు పత్తి విత్తనాలు నాటడం ప్రారంభించారు. మరికొందరు విత్తన విక్రయ కేంద్రాల బారులు తీరడంతో పెదనందిపాడులో సందడి నెలకొంది.