క్రైమ్/లీగల్

నదిలో పడి యువకుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు: స్థానిక రిజర్వాయర్‌లో యువకుడి మృతదేహం శుక్రవారం లభ్యం కావడంతో మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు ఎస్సై విభూషణరావు అందించిన వివరాలిలా ఉ న్నాయి. జీకేవీధి మండలం దారకొండకు చెందిన కంబాల వంశీ(19) విశాఖపట్నం కృష్ణాకాలేజీలో బీఎస్సీ మైక్రోబయోలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వంశీ సీలేరుకు చెందిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈనేపధ్యంలో మంగళవారం వంశీ విశాఖ నుంచి సీలేరు వచ్చి అమ్మాయితో కలిసి దేవాలయం వద్ద అర్దగంట సేపు మాట్లాడాడు. అనంతరం అమ్మాయి వారి ఇంటికి వెళ్ళిన కొద్ది సమయానికే స్థానిక రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై తెలిపారు. ఈమేరకు బంధువుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.