కృష్ణ

కదంతొక్కిన అగ్రిగోల్డ్ బాధితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రజల సొమ్మును లూటీచేసి ఇతర దారుల్లో మళ్లించడంతో లక్షలాది మంది బాధితులు రోడ్డున పడ్డారని, రాష్ట్ర ప్రభుత్వమే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ సమస్య జటిలమైందని, సంస్థ ఆస్తుల కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్, కొందరు మంత్రులు, అధికారపక్ష ప్రజాప్రతినిధుల హస్తాలు వున్నట్లు ప్రచారం జరుగుతోందంటూ వారు ధ్వజమెత్తారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సిబిఐ విచారణ జరిపించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై సరైన సమాధానం చెప్పనిపక్షంలో గ్రామస్థాయి నుండి ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
లక్షలాది మంది ఏజెంట్లు, డిపాజిటర్లను దారుణంగా మోసగించి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని డిపాజిటర్లకు చెల్లించాలని, ప్రభుత్వమే కొంత మొత్తాన్ని ముందుగా చెల్లించి ఆత్మహత్యల్ని నివారించాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన భారీ ర్యాలీలో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది బాధితులు నగర వీధుల్లో కదంతొక్కారు. పండిట్ నెహ్రూ బస్టేషన్ సమీపంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకు బాధితులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం మినహా వివిధ రాజకీయ పక్షాల నాయకులు ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎనిమిది రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులు 40 లక్షల మందికి పైగా వున్నారని అన్నారు. తమ అవసరాల కోసం మదుపు చేసిన చిరు వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, వృద్ధులు దాదాపు రూ.6,850 కోట్లు పెట్టుబడిగా పెట్టి చిన్న మొక్కను మహావృక్షం చేశారన్నారు. యాజమాన్యం ఆ డబ్బంతా దోచేసి బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డునపడాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ సమస్యను దాటవేస్తున్న తరుణంలో దీనికి ఉద్యమరూపం ఇవ్వకుండా డబ్బులు రాబట్టలేమన్నారు. అందుకే రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 20 లక్షల మంది బాధితులున్నారంటూ ముఖ్యమంత్రి బాధితుల వైపు ఉంటారో, అవ్వాస్ కుటుంబం వైపు వుంటారో తేల్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పిసిసి అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వున్న బాధితులపై ఆధారపడిన వారు 2కోట్ల మందికి పైగా వున్నారని, 20 నెలలుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కేవలం ఒక్క శాతం ఓట్లతో టిడిపి అధికారంలోకి వచ్చిందని, బాధితులు 22 శాతం మంది వున్నారని, వారంతా తల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎక్కడ వుంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం తక్షణమే అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు చెక్కుల రూపంలో అందజేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సిపి నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ బాధితులను రక్షించాల్సిన ప్రభుత్వమే దోపిడీదారులకు అండగా నిలవటం సిగ్గుచేటన్నారు. ఎన్టీఆర్ వారసత్వం పేరిట అధికారాన్ని అనుభవిస్తున్న తన అల్లుడు చంద్రబాబుకు 67 ఏళ్లు మీదపడినా ఇంకా ఆశ చావలేదని విమర్శించారు. కుమారుడి పాత్ర కూడా వుందనే ప్రచారానికి తలొగ్గి చిత్తశుద్ధి వుంటే దానిపై విచారణ జరపాలన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు కె రామకృష్ణ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు ఏడాదికి పైగా పోరాటం చేస్తున్నా ఏమాత్రం స్పందించని హోంమంత్రి చినరాజప్ప ఈ ర్యాలీ చేపట్టిన వామపక్షాలను విమర్శిస్తున్నారని, ఆయన రాజప్ప కాదు.. వాజప్ప అంటూ ఎద్దేవా చేశారు. దీనివెనుక పాలక పార్టీ ప్రజాప్రతినిధుల హస్తముందనే ప్రచారం జరుగుతున్నందున ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా మేధావుల ఫోరం నాయకుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ లక్షల కోట్లు బ్యాంకుల్లో దోపిడీ చేసి విదేశాలకు పారిపోయిన వారిని పాలకులు ఎటూ పట్టించుకోవటం లేదన్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసి కూడబెట్టుకున్నవారి డబ్బుపై కూడా పెద్దలు కనే్నయడం దారుణమన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలు, బాధితుల పేర్లను ఆన్‌లైన్‌లో వుంచాలని, సమస్య పరిష్కారమయ్యేంత వరకు బాధితులందరికీ ఎంతో కొంత సహాయపడాలని కోరారు. సభలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ బాబూరావు, వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, బిసి జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. గంగాధర్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.