క్రైమ్/లీగల్

సంజయ్ జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 24: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్ తనయుడు, నిజామాబాద్ నగర మాజీ మేయర్ డీ.సంజయ్ జ్యుడీషియల్ రిమాండ్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఫ్యామిలీ కోర్టు జడ్జి సుదర్శన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపర్చగా, 24వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం విదితమే. ఈ కేసును విచారణ జరుపుతున్న ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానం జడ్జి రమేష్ సెలవుపై వెళ్లడంతో, సంజయ్ కేసును ఫ్యామిలీ కోర్టు జడ్జి సుదర్శన్ శుక్రవారం విచారణ జరిపారు. ఆయన బోధన్‌లోని అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఇన్‌చార్జి జడ్జిగా కూడా వ్యవహరిస్తుండడం వల్ల బోధన్‌లోనే ఈ కేసును విచారణ జరిపి మరో రెండు వారాల పాటు రిమాండ్‌ను పొడిగించారు. మరోవైపు సంజయ్‌కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు జీవీ.కృపాకర్‌రెడ్డి, ఆకుల రమేష్ మలివిడత బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాకముందే గత మూడు రోజుల క్రితమే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాధిత విద్యార్థినుల వాంగ్మూలాలను న్యాయస్థానం సేకరించింది. దీంతో సంజయ్ కేసు మరింత బలంగా మారినట్లయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానం సంజయ్‌కు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు అంతంతమాత్రమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.