క్రైమ్/లీగల్

దళిత యువకుడిపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గంపేట, ఆగస్టు 25: జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో దళిత యువకుడిపై అయిదుగురు యువకులు దాడికి పాల్పడారు. దీంతో వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చేందిన దళిత నాయకులు రోడ్డుపై బైఠాయించారు. గతంలో హిందూవులు, క్రైస్తవుల మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో పాతకక్షలు మళ్లీ పొడచూపాయి. శనివారం గ్రామానికి చెందిన కాటే బాబి అనే యువకుడిని దారికాచి ఒక వర్గానికి చెందిన వారు దాడిచేసి గాయపరచారంటూ కాట్రావులపల్లి జగ్గంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహిచారు. గాయపడిన బాబిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి అదుపు తప్పడంతో గ్రామంలో తహసీల్దారు ఎల్ శివమ్మ 144 సెక్షన్ అమలు చేశారు. గ్రామానికి చెందిన వెన్నా కాశీ, సుబ్బారావు, ఎం దుర్గబాబు, హరీష్, లంకలపల్లి శ్రీను దాడి చేశారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఐ పి కాశీ విశ్వనాధం, ఎస్సై ఎం ఏసుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఈ ఘటపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటపై పెద్దాపురం డిఎస్పీ సిహెచ్‌వి రామారావు బాధితుడి వద్ద వివరాలు తీసుకుని కేసును పర్యవేక్షిస్తున్నారు.

మన్యంలో ఆగని శిశుమరణాలు
దూసరపాములో రెండునెలల పసిబిడ్డ మృతి
రాజవొమ్మంగి, ఆగస్టు 25: మాతా, శిశుమరణాలు అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ప్రకటనలు చేస్తున్నా మరో పక్క మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా దూసరపాము గ్రామానికి చెందిన పూసం రాముకు జన్మించిన రెండునెలల వయస్సున్న మగబిడ్డ అనారోగ్యంతో బాధ పడుతూ శుక్రవారం రాత్రి మరణించగా శనివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. రాము జూన్ 26న కాకినాడ జనరల్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుండి క్షేమంగా ఉన్న బిడ్డ శుక్రవారం సాయంత్రం శ్వాస పీల్చుకోడానికి ఇబ్బంది పడుతూ పాలు తాగకపోడంతో తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో సిబ్బంది బిడ్డకు ఆక్సిజన్ అందించారు. అయినా బిడ్డ పరిస్థితి కుదుట పడకపోగా విషమించడంతో హుటాహుటిన ప్రయివేటు వాహనంలో ఆ బిడ్డను ఏలేశ్వరం ప్రయివేటు ఆసుపత్రిలో రాత్రి 10గంటలకు చేర్పించారు. ఆసుపత్రిలో 2500 రూపాయలు కట్టించుకొని వైద్యం మొదలు పెట్టారని, ఒక ఇంజక్షన్ చేసిన వెంటనే బిడ్డ మరణించాడని రాము ఆవేదన వ్యక్తం చేసింది. కూలి పనిచేసుకొని జీవించే తాము బిడ్డను బ్రతికించుకొనేందుకు అనేక ఇబ్బందులు పడ్డామని అయినా దక్కలేదన్నారు. రాజవొమ్మంగి ఆసుపత్రిలోవైద్యులు లేకపోడం వలన, ఏలేశ్వరం ప్రయివేటు ఆసుపత్రిలో సరైన వైద్యం అందకపోడం వలనే బిడ్డ మరణించాడని రాము కన్నీరుమున్నీరుగా విలపించసాగింది.

రామచంద్రపురంలో విషాదచ్ఛాయలు
కృష్ణ జిల్లాలో ప్రమాదం:రామచంద్రపురం ఎస్‌ఐ గల్లంతు
రామచంద్రపురం, ఆగస్టు 25: పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధిత ప్రజల పట్ల పూర్తిస్థాయిలో ఆదరణ చూపిస్తూ చట్టం, న్యాయం పట్ల విధేయత కనబరుస్తూ అధికారులూ, ప్రజాప్రతినిధుల పట్ల మంచి భావాన్ని వ్యక్తపరిచే రామచంద్రపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ కోట వంశీధర్ కృష్ణా జిల్లాలో జరిగిన జల ప్రమాదంలో గల్లంతవడంతో రామచంద్రపురంలో విషాదం నెలకొంది. శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడంతో ఈ ఉదంతం ప్రజలకు తెలిసింది. పోలీస్ ఉన్నతాధికారులు, కానిస్టేబుళ్లతోపాటు రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని అత్యధిక సంఖ్యాకులు వంశీధర్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఉదయమే తన తల్లిని తీసుకుని సొంత ఊరు వెళ్తుండగా విజయవాడ - అవనిగడ్డ కరకట్టపై ఘంటసాల మండలం పాప వినాశనం వద్ద వంశీధర్ నడుపుతున్న కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. తన తల్లిని రక్షించిన అనంతరం కారులో ఉన్న విలువైన సామానును తీసుకొచ్చే ప్రయత్నంలో ఎస్‌ఐ వంశీధర్ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే రామచంద్రపురం డిఎస్పీ జయంతి వాసవీ సంతోష్, రామచంద్రపురం సిఐ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్, కె గంగవరం ఎస్‌ఐ జి నరేష్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇప్పటివరకు గల్లంతైన ఎస్‌ఐ వంశీధర్ ఆచూకీ లభించలేదని ఘటనా స్థలి నుండి డిఎస్పీ సంతోష్ తెలిపారు. ఇలావుండగా వంశీధర్ గల్లంతవడం పట్ల శాసన సభ్యుడు తోట త్రిమూర్తులు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీ రాజా కాకర్లపూడి రాజగోపాల నర్సరాజు (గోపాల్‌బాబు), ఆర్డీవో ఎన్ రాజశేఖర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.