ఆంధ్రప్రదేశ్‌

మత్స్య విశ్వవిద్యాలయానికి తొలగిన అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 4: మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రైవేటు యాజమాన్యం నిబంధనలు పాటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయటంతో ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుచేయ తలపెట్టిన ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయి ఏడాదిన్నర గడిచింది. కొత్తగా ఏర్పాటయ్యే ఈవిశ్వవిద్యాలయం ఎలా ఉండాలి? ఇందుకు సంబంధించి ప్రభుత్వం, ప్రైవేటు యాజమాన్యం ఏం చేయాలనే విషయమై విధివిధానాలు రూపొందించినా వీటిలో కొన్ని అంశాలకు ప్రైవేటు యాజమాన్యం సంతృప్తికర ప్రతిపాదనలు అందించలేదని నిపుణుల కమిటీ భావించడంతో విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యం నెలకొంది. ఈ అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగుల, పశుగణాభివృద్ధి, పాడి పరిశ్రమ, మత్స్యశాఖల మంత్రి ఆదినారాయణరెడ్డి మంగళవారం సచివాలయంలో శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అధికారులు, నిపుణుల కమిటీ సభ్యులు, ఆనంద గ్రూప్ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మత్స్య విశ్వ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలను మంత్రి చర్చించారు. తాము సరికొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చామని వాటిని పునస్సమీక్షించి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనుమతివ్వాల్సిందిగా ప్రైవేటు యాజమాన్య సంస్థ ప్రతినిధులు మంత్రి ఆదినారాయణరెడ్డి, ఉన్న తాధికారులకు వివరించారు. నిపుణుల కమిటీ పరిశీలన జరిపిన అనంతరం ఇంకా ఏవైనా అంశాలను చేర్చాల్సి వస్తే అందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు ఆనంద గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు. నిపుణుల కమిటీ సిఫార్సులు, ప్రైవేటు సంస్థ అందించిన అన్ని ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయాలని శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయ అధికారులను మంత్రి ఆదేశించారు. త్వరలోనే మరోసారి నిపుణుల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలోగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటులో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా సమన్వయంతో వ్యవహరించాలని నిపుణుల కమిటీ, ప్రైవేటు యాజమాన్యం నిర్ణయించారు.