ఆంధ్రప్రదేశ్‌

గురువులే స్వర్ణాంధ్ర పథ నిర్దేశకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 4: ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞాన ఖనిగా, సకల విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పానికి సహకరించి కలను సాకారం చేయాలని ఉపాధ్యాయలోకానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. బుధవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో విద్యాబోధన చేస్తున్న గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అసాధారణ స్థాయికి ఎదిగి అత్యున్నత పదవులు చేపట్టి మొత్తం ఉపాధ్యాయ సమాజానికే స్ఫూర్తినిచ్చారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్లాఘించారు. రాష్ట్రాన్ని నాలెడ్జి సొసైటీగా ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే కృషి నిర్విరామంగా కొనసాగుతోందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేనన్ని విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్‌లో కొలువు తీరనున్నాయని, సమీప భవిష్యత్తులో రాష్ట్రం సకల విద్యలకు గమ్య స్థానంగా ఎదగడం తథ్యమన్నారు. బదిలీల కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. ఎలాంటి సిఫార్సులకు తావులేకుండా కేవలం ప్రతిభ ఆదారంగా ఉపాధ్యాయులను నియమించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తే అన్నివర్గాల వారికి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుందని, ఆ దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అక్కడ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. చదువునేర్చిన గురువుల్ని ఎలాంటి వారైనా గుండెల్లో గూడుకట్టుకుని ఆరాధిస్తారని ఉద్బోధించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనది.. ఎనలేని సంతృప్తినిచ్చేది.. అధ్యాపకులు తమ జీవిత చరమాంకంలో ఎందరికి చదువు చెప్పాం? ఎందరు రాణించారు? ఎంతమంది ఉన్నత స్థానాలకు చేరారో తలచుకుంటే అంతకంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను గొప్ప వైజ్ఞానిక రాష్ట్రంగా రూపుదిద్దుకునేలా చేయటంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక.. వారే స్వర్ణాంధ్ర పథ నిర్దేశకులని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం..పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం.. ప్రకృతితో అనుసంధానమయ్యేలా మొక్కలు పెంచి హరిత వాతావరణం సృష్టిస్తున్నామని వివరించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. చిన్నారులకు పౌష్టికాహారం, పాఠశాలల్లో వౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధుల కొరతలేదని తేల్చిచెప్పారు. ప్రతి పాఠశాలలో వర్చువల్ తరగతిగదుల్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విజ్ఞానాన్ని మన విద్యార్థులు అవలంబించేలా నవీన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. అధునాతన బోధనా పద్ధతులతో విద్యా విషయక సమాచారాన్ని అందిస్తున్నాం..ఇంకా ఎన్నో మార్పులు ప్రవేశపెడుతున్నామని వీటి వల్ల ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. అనితర సాధ్యమైన ఫలితాలు కూడా వస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక గౌరవాన్ని అందుకుంటున్న పురస్కార గ్రహీతలను అభినందించారు. వారి స్ఫూర్తితో ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు.
నేడు సీకే కనె్వన్షన్‌లో పురస్కారాల ప్రదానం
గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కనె్వన్షన్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్టమ్రంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు హాజరుకానున్నారు.