ఆంధ్రప్రదేశ్‌

స్పీకర్ పదవికే మచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటి), సెప్టెంబర్ 5: భారత రాజ్యాంగ విలులవలను కాలరాసే విధంగా శాసనసభ స్పీకర్ కోడెల ప్రసాదరావు వ్యవహరిస్తున్నారని అసెంబ్లీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ పినె్నల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పార్టీ మారిన వారిన వారిని అనర్హులుగా ప్రకటించకుండా, టీడీపీ కండువా కప్పుకుని పార్టీ నాయకుడిలా ప్రవర్తించడం సిగ్గు చేటన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వైకాపా ఎమ్మెల్యేలతో కలిసి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైకాపా గుర్తుతో గెలిచి పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటిస్తేనే అసెంబ్లీకి హాజరౌతామని ప్రకటించారు. ఇప్పటికే పలు మార్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను అభ్యర్థించామన్నారు. వారిని అనర్హులుగా ప్రకటిస్తేనే అసెంబ్లీ వర్షాకాలం సమావేశాలకు హాజరౌతామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర స్పీకర్ చేయని విధంగా ఏపీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచి టీడీపీ తరుపున అసెంబ్లీలో కూర్చుంటే స్పీకర్ ఏ విధంగా సభను నడుపుతారో స్పష్టం చేయాలన్నారు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ టీడీపీ కండువాలు కప్పుకుని కోడెల టీడీపీ పార్టీ అధికారిక కార్యక్రమాలకు హాజరౌతున్నారని విమర్శించారు. సీఎంకు పాలాభిషేకం చేయడం, పాదాభివందనం చేయడం స్పీకర్ పదవికే కళంకం అన్నారు. ఇటువంటి స్పీకర్ దగ్గరకు వెళ్లడం తమకు ఇష్టం లేదన్నారు. వైకాపాలో గెలిచిన ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులను అనర్హలుగా ప్రకటిస్తే వెంటనే అసెంబ్లీకి హాజరౌతామని ఆయన వివరించారు.
సీఎంకు వైకాపా లేఖ
వైకాపా తరుపున గెలిచి టీడీపీ కండువాతో అసెంబ్లీకి హాజరౌతున్న ఎమ్మెల్యేలను, మంత్రులను తొలగిస్తే తప్పకుండా అసెంబ్లీ హాజరౌతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు వైకాపా ఎమ్మెల్యేలు తప్పకుండా హాజరు కావాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన విజ్ఞాపన నేపథ్యంలో ఈ బహిరంగ లేఖ రాసినట్లు వైకాపా ఎమ్మెల్యేలు విలేఖరుల సమావేశంలో చెప్పారు. లేఖలోని అంశాలను ప్రస్తావించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుని, వారిని పదవుల నుండి తొలగిస్తే అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతామన్నారు. ప్రజాస్వామ్యంలో దేవాలయం వంటి అసెంబ్లీలో స్పీకర్ విలువలు పాటించకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొమ్ము కాయడం దారుణమన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ఏ ప్రమాణాల్లో సభను నిర్వహిస్తారో చెప్పాలన్నారు. ఫిరాయింపుకు సంబంధించి చట్టాలను, ప్రజాస్వామ్య సూత్రాలను, రాజ్యాంగ నియమాలను సైతం స్పీకర్ ఉల్లంఘిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. శాసనసభ జాబితాలో వారిని వైకాపా సభ్యులుగా చూపుతూ మరోవైపు అధికార పక్షం బెంచీల్లో కూర్చోబెట్టే దుర్మార్గమైన చర్య దేశంలో ఎక్కడా లేదన్నారు. శాసన సభ గౌరవం మంటగలపడంలో స్పీకర్ పాత్ర కూడ ఉందన్నారు. స్పీకర్ పదవిలో ఉంటూ సీఎంకు పాలభిషేకం, పాదాభివందనం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రజల సమస్యల మీద చర్చించే ధ్యైర్యం, సత్తా ఉంటే వెంటనే ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హలుగా ప్రకటించాలన్నారు.