రాష్ట్రీయం

దుష్టపాలన అంతం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: దుర్మార్గపు, దుష్ట పాలన అంతమొందించేందుకు భావసారూప్యగల పార్టీలు, ప్రజా సంఘాలు తమతో కలిసి రావాలని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం భారత్ బంద్‌లో పాల్గొన్న అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా, ఇతర నాయకులు కే. జానారెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్ తదితరులతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో దుర్మార్గపు పాలనకు అంతమొందించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ నేతృత్వంలోని కమిటీతో త్వరలో చర్చలు జరపనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో ఇప్పటి వరకూ ఎలాంటి చర్చలు జరపలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ఎన్నికల్లో ఉప్పల్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన బండారి లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని ప్రస్తావించగా ‘లక్ష్మారెడ్డితో నేను చర్చించలేదు. వ్యక్తిగత ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయోమో తెలియదు’
అని బదులిచ్చారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ మళ్లీ వెనక్కి వస్తున్నారా? ఆయన్ను కలిసారా? అన్న ప్రశ్నకు ‘కలిస్తే తప్పేమిటీ?’అని ఎదురుప్రశ్నించారు.
నేటీ నుంచి జెండా పండుగ
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నుంచి 18వ తేదీ వరకూ జెండా పండుగ నిర్వహించాలని ఉత్తమ్ ఆదేశించారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో పార్టీ జెండాలు ఎగుర వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త తమ ఇంటిపై విధిగా పార్టీ జెండా ఎగుర వేయాలని ఆయన తెలిపారు. కాగా ఈ నెల 12న ఏఐసీసీ నాయకుడు గులాంనబీ ఆజాద్ హైదరాబాద్‌కు రానున్నారని పీసీసీ చీఫ్ వెల్లడించారు. మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన అనంతరం సాయంత్రం సంగారెడ్డిలో జరగనున్న మైనారిటీల బహిరంగ సభకు హాజరవుతారని ఆయన చెప్పారు.