విజయనగరం

రేషన్ షాపుడీలర్ల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 17: రేషన్‌షాపుడీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట డీలర్లు ధర్నా చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం జంక్షన్ నుంచి కోట, మూడులాంతర్లు, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరికోవెల, నాయుడు ఫంక్షన్ హాలు, కంటోనె్మంట్ గూడ్స్‌షేడ్ మీదుగా కలెక్టరేట్ జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ ధర్నా చేసిన అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఫలితంగా పార్వతీపురం-విజయనగరం ప్రధాన రహదారిలో రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనలో పాల్గొన్న ఆంద్రప్రదేశ్ రేషన్‌డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బుగత వెంకటేశ్వరరావుతోపాటు 11 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వరరావుమాట్లాడుతూ జీవోనెంబర్ 15ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్‌డీలర్లను నాలుగవ తరగతి ఉద్యోగులుగా పరిగణించి గౌరవవేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. డీలర్లు చేపడుతున్న ఆందోళకు వైకాపా ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సంఘీభావం ప్రకటించారు. డీలర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీలర్స్ అసోసియేషన్ కార్యనిర్వహక అధ్యక్షుడు సముద్రపురామారావుతదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపాలి

చీపురుపల్లి, సెప్టెంబర్ 17: సంస్థ పరిధిలో నమోదు అవుతున్న విద్యుత్ సమస్యల పరిష్కారంలో అందరూ కృషి చేయాలని గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంఘం ఛైర్మన్ దన్నాన రామచంద్రుడు అన్నారు. సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆయన వినియోగదారుల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలపై వస్తున్న వినతులుపై తక్షణం స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంస్థ ఎండి పిల్లి రమేష్, ఏవో రామకృష్ణ, అధికారులు శశిభూషణరావు, శ్రీనివాసపట్నాయిక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

గురజాడ అడుగుజాడల్లో నడవాలి
గజపతినగరం,సెప్టెంబర్ 17: ప్రతి ఒక్కరూ గురజాడ అడుగుజాడలలో నడిచి తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. సోమవారం తెలుగుభాషా పరిరక్షణ సమితి, గీతా చారిటిబుల్ ట్రస్ట్ ఉత్తరాంథ్ర రచయత వేదిక సంయుక్త నిర్వహణలో విజయనగరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వివిధరంగాలలో తెలుగుభాషా పరిరక్షణకు కృషి చేసిన పలువురికి ఘనంగా సత్కరించారు. మాజీ ఎంపి డివిజి శంకరరావు మాట్లాడుతూ అతి పిన్నవయసులో సంగీత, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో బొంతలకోటి, భక్తిసమాచారం పత్రిక ద్వారా తెలుగుభాషాభివృద్ధికి, సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న సంపాదకుడు నాగరాజుల కృషి అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక అధికారి లక్ష్మీనారాయణ, ప్రముఖ వైద్యులు గాడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.