ఆంధ్రప్రదేశ్‌

జలాశయాల్లో తిలాపియా చేపల పెంపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 17: రాష్ట్రంలోని జలాశయాల్లో కేజ్‌కల్చర్ ద్వారా తిలాపియా చేపల పెంపకాన్ని చేపట్టేందుకు అమెరికాకు చెందిన ‘ది ఫిష్ ఇన్’ సంస్థ ముందుకొచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రెండు అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఏపీ మత్స్యశాఖ ఉన్నతాధికారులు, ది ఫిష్ ఇన్ సంస్థ ప్రతినిధులు ఒప్పంద, అవగాహన పత్రాలపై సంతకాలు చేశారు. ప్రస్తుతం ఆక్వాకల్చర్‌లో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న తిలాపియా రకం చేపల్లో మాంసకృత్తులు, విటమిన్ బి, డి, ఒమేగా3 ఫాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయని అధికారులు వివరించారు. ఏపీలో అనుకూల వాతావరణం, చేపల మేత పరిశ్రమలు అతి చేరువలో ఉండటం, ఓడరేవులను అభివృద్ధిపరచటం, ఉత్సాహవంతులైన రైతులు తదితర సానుకూల అంశాలతో పాటు చేపల సాగుకు బడా కంపెనీలు ముందుకొస్తున్నాయి.క ప్రమాణాలలో నాలుగు నక్షత్రాల స్థాయి మెరుగైన ఆక్వాసాగు విధానాలు (బీఏపీ)తో ఫిష్ ఇన్ సంస్థ పేరుగాంచింది. ఏపీలో వివిధ జలాశయాల్లో చేపల పెంపకానికి సంబంధించి రూ 500 కోట్లు పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తంచేసింది. దీనివల్ల నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా, మరో 8 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో తిలాపియా ఆక్వా సాగు చేపడుతున్నట్లు సంస్థ చైర్మన్ మనీష్ కుమార్, ఎండీ మహబూబ్ అల్త్ఫా ముఖ్యమంత్రికి వివరించారు. రానున్న కాలంలో ఏపీలో మత్స్య, సముద్ర ఉత్పత్తుల పరిశ్రమ ప్రపంచానికి దిక్సూచిగా మారగలదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది, ఫిషరీస్ కమిషనర్ రామశంకర నాయక్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఏవీ రాజవౌళి తదితరులు పాల్గొన్నారు.
పశుగణాభివృద్ధిలో పరిశోధనలకు ఒప్పందం
పశుగణ రంగంలో అత్యున్నత స్థాయి విస్తృత పరిశోధనలకు ఆంధ్రప్రదేశ్ పశుగణ ఆధునిక పరిశోధన కేంద్రం (ఏపీసీఏఆర్‌ఎల్), జీవకణ , అణుజీవశాస్త్ర పరిశోధనా కేంద్రం (సీసీఎంబీ)ల మధ్య సోమవారం శాసనసభ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఏపీసీఏఆర్‌ఎల్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంతర్జాతీయ స్థాయి ప్రయోగశాలల్లో ఇకపై సీసీఎంబీ పరిశోధన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పశుగణం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిశోధనలతో పరిష్కారం కనుగొనటమే ఒప్పంద ముఖ్య ఉద్దేశ్యం. సమస్యలకు పరిష్కారాలు అందించడం, విజ్ఞాన మార్పిడి, నైపుణ్య శిక్షణ ద్వారా రైతుల జీవనోపాధి, ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు కార్యాచరణ రూపొందిస్తారు. పశుగణ రంగంలో రెండంకెల వృద్ధిరేటు సాధనకు ఈ ఒప్పందం ముందడుగు కాగలదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. అంతరించి పోతున్న జీవజాతులను సంరక్షించటంలో నిరంతర పరిశోధనలు సాగిస్తున్న జీవకణ, అణు జీవశాస్త్ర పరిశోధనా కేంద్రం (సీసీఎంబీ) పశుగణ పరిశోధనలో స్వయం ప్రతిపత్తిగల సంస్థగా వివిధ సమస్యలకు పరిష్కారం అనే్వషించి క్షేత్రస్థాయిలో పశువైద్యులు, రైతులకు చేరవేస్తున్న ఆంధ్రప్రదేశ్ పశుగణ ఆధునిక పరిశోధన కేంద్రం (ఏపీసీఏఆర్‌ఎల్) సంయుక్త భాగస్వామ్యం, పరస్పర సహకారం, సమన్వయంతో ఏపీలో పశుగణాభివృద్ధికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విశ్వసిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

చిత్రం..ముఖ్యమంత్రి సమక్షంలో సీసీఎంబీతో ఒప్పందం కుదుర్చుకుంటున్న దృశ్యం