తెలంగాణ

అమిత్‌షా పేరు చెబితే కాంగ్రెస్‌లో వణుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ గురించి మాట్లాడే హక్కు లేదని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీ్ధర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానిని విమర్శిస్తే రేవంత్ పెద్ద నాయకుడు అవుతాడని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తుంటరి నాయకుడని, ఏదో మాట్లాడితే ఏదో పదవి ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నందని అన్నారు. రేవంత్‌ను కాంగ్రెస్ పార్టీ ఐటం సాంగ్ క్యారెక్టర్ మాదిరి వాడుకుంటోందని, ఇలాంటి వేషాలు వెయ్యకంటే ఆ పార్టీలో చెల్లదని అర్ధం చేసుకున్న రేవంత్ అనేక వేషాలు వేస్తున్నారని ఆరోపించారు. అమిత్ షా రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడినట్టు చెప్పుకోవడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలుగుదేశం కోవర్టు అని మరిచిపోవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగలతో నిండిపోయిందని, కోర్టులు దొంగలకు కాకుండా సామాన్యులకు నోటీసులు పంపుతారా అని ప్రశ్నించారు. అమిత్‌షా ఒకసారి వస్తేనే కాంగ్రెస్ పార్టీ వణికిపోతోందని, టీఆర్‌ఎస్‌తో అంటకాగే పరిస్థితి తమకు రాలేదని అన్నారు. తాము ఎవరితో కలిసిపోయేది లేదని చెప్పారు. ఉత్తమ్ , పొన్నాలపై కేసులున్నాయని వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. హోం మంత్రి బఫూన్ మాటలు మాట్లాడుతున్నారని , జండాలు ఎగురవేసే మంత్రిలా మారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.